
షణ్ముఖ్ జశ్వంత్ (Shanmukh Jaswanth).. యూట్యూబ్‌లో ఒకప్పుడు వెలుగు వెలిగాడు. వెబ్ సిరీస్‌లు, కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలింస్‌తో బాగా క్లిక్కయ్యాడు. టాప్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా రాణిస్తున్న సమయంలోనే బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. అలా తెలుగు బిగ్‌బాస్ ఐదో సీజన్‌లో పాల్గొన్నాడు. అప్పటికే దీప్తి సునయనతో ప్రేమలో ఉన్న ఇతడు బిగ్‌బాస్‌లో మాత్రం సిరి హన్మంత్‌తో లవ్ ట్రాక్ నడిపాడు. దీంతో ఇతడిపై విపరీతమైన నెగెటివిటీ వచ్చింది.
వివాదాల్లో షణ్ను
షో నుంచి బయటకు వచ్చాక దీప్తి సునయనతో బ్రేకప్.. ఓ కేసులో ఇరుక్కోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటపడుతూ సినిమాలు చేస్తున్నాడు. చాలాకాలం తర్వాత తొలిసారి షణ్ముఖ్ ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈమేరకు గ్లింప్స్ వదిలారు. అందులో షణ్ను మాట్లాడుతూ.. నాకు యాక్టింగ్‌పై చాలా ఆసక్తి ఉందని మా నాన్నకు చెప్తే చెప్పు తెగుద్ది అన్నారు.
జీవితం అయిపోయిందనుకున్నా
నేను బిగ్‌బాస్‌కు వెళ్లకుండా ఉండుంటే బాగుండేదని చాలాసార్లు అనిపించింది. తర్వాత ఓ కేసులో నా పేరు వచ్చింది. చాలా బాధపడ్డాను. దాన్నుంచి అంత ఈజీగా బయటపడలేకపోయాను. ఇక నా జీవితం అయిపోయింది అనుకున్నాను. అలా ఒకరోజు రోడ్డుపై వెళ్తుంటే ఒక పిల్లాడు నన్ను పిలిచి, నువ్వంటే చాలా ఇష్టం అన్నా.. కానీ, ఇప్పుడు నచ్చట్లేదని చెప్పాడు. అప్పుడు నాలో ఆలోచన మొదలైంది. కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఆరోజే నిర్ణయించుకున్నాను.
అమ్మకు క్యాన్సర్
ఈ మధ్య మా నాన్న రైలు అందుకోవాలన్న ఆత్రంతో ప్లాట్‌ఫామ్‌పై పరిగెడుతుండగా బీపీ ఎక్కువై పడిపోయాడు. ఆరోజు నేను బాధను పంటికింద బిగపట్టాను. ఎందుకంటే అమ్మకు క్యాన్సర్. తనకు సర్జరీ జరిగింది. నేను ఏడిస్తే తను ఏడుస్తుంది. అమ్మ ఏడిస్తే కుట్లు ఊడిపోతాయి. అందుకని ఆరోజసలు నేను ఏడవనేలేదు. ఏదేమైనా నేను మా నాన్నకు మంచి కొడుకును కాలేకపోయాను అంటూ షణ్ముఖ్ ఎమోషనలయ్యాడు.
చదవండి: పేదల బతుకుల్లో విషాదం.. విజయ్‌ను అరెస్ట్ చేయాలి: హీరోయిన్