భర్త మహాశయులకు విజ్ఞప్తి.. ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్..! | Ravi Teja's Movie Bhartha Mahasayulaku Wignyapthi Song Out Now | Sakshi
Sakshi News home page

Bhartha Mahasayulaku Wignyapthi: ఇద్దరు హీరోయిన్లతో రవితేజ రొమాంటిక్ సాంగ్‌..!

Jan 2 2026 4:36 PM | Updated on Jan 2 2026 4:41 PM

Ravi Teja's Movie Bhartha Mahasayulaku Wignyapthi Song Out Now

మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది సంక్రాంతి రేసులోకి వచ్చేశారు. గతేడాది హిట్‌ రాకపోవడంతో ఈ సారి ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన హీరోగా వస్తోన్న భర్త మహాశయులకు విజ్ఞప్తి సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా కోసం రవితేజ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా ఈ మూవీ నుంచి ఫుల్ ఎనర్జిటిక్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. వామ్మో..వాయో అంటూ సాగే ఫుల్ రొమాంటిక్‌ పాట ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటలో ఆషిక రంగనాథ్, డింపుల్ హయాతి గ్లామర్‌ ఈ పాటకు మరింత ‍‍స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ సాంగ్‌రకు దేవ్ పావేర్ లిరిక్స్ అందించగా.. స్వాతిరెడ్డి ఆలపించారు. కాగా.. ఈ సినిమాకు భీమ్ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement