
తిన్నాతిరం పడతలే, ఎర్ర ఎర్ర రుమాల్ కట్టి, దారిపొంటత్తుండు, నా పేరే ఎల్లమ్మ.. వంటి పాటలతో యూట్యూబ్‌లో నెస్సేషన్ అయింది ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ (Nagadurga Gutha). నాలుగేండ్ల వయసులోనే కూచిపూడి నేర్చుకుంది. పద్నాలుండేగ్ల వయసులో పేరిణి నాట్యం నేర్చుకుంది. నృత్యకారిణిగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన ఆమె నల్గొండలో నాగదుర్గ నృత్యాలయం కూడా స్థాపించింది. లాక్‌డౌన్‌లో ఆమె నటించిన తిన్నాతిరం పడతలే.. పాట వంద మిలియన్ల వ్యూస్ సాధించింది.
ఫోక్ సాంగ్స్ క్వీన్
ఆ పాటతో ఆమెకు అవకాశాలు కుప్పలుతెప్పలుగా వచ్చాయి. ఎన్నో యూట్యూబ్ సాంగ్స్‌లో అందంగా స్టెప్పులేసింది. నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్‌లో నటించే ఛాన్స్ వచ్చిందట! అలాగే అశోకవనంలో అర్జున కల్యాణం మూవీలో హీరోయిన్‌గా అడిగారట! కానీ ఆ అవకాశాలను తిరస్కరించిన నాగదుర్గ.. నటన అంటే ఇష్టమే కానీ నాట్యంలో డాక్టరేట్ సాధించాలనేది నా కల అని చెప్పుకొచ్చింది. పీహెచ్‌డీ పట్టా చేతికొచ్చాకే సినిమాల గురించి ఆలోచిస్తానన్న ఈమె కలివి వనం అనే ఒకే ఒక్క సినిమాలో మాత్రం నటిచింది.
బిగ్‌బాస్‌పై ఆసక్తి లేదు
ఇంతలో నాగదుర్గ తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్‌లో పాల్గొననుందని ప్రచారం జోరందుకుంది. ఈ ప్రచారంపై నాగదుర్గ స్పందించింది. తాను బిగ్‌బాస్ 9వ సీజన్‌కు వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ షోకి వెళ్లాలన్న ఆసక్తి తనకు ఏమాత్రం లేదని తెలిపింది. కాబట్టి ఈ ప్రచారానికి ఇంతటితో ఫుల్‌స్టాప్ పెట్టమని కోరింది. అయితే త్వరలోనే ఓ పెద్ద అప్‌డేట్ ఇవ్వనున్నట్లు పేర్కొంది.

చదవండి: దృశ్యం నటుడు కన్నుమూత