
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆశిష్ వారంగ్ (55) ఇక లేరు. హిందీలో దృశ్యం, సూర్యవంశి వంటి హిట్ చిత్రాల్లో నటించిన ఆయన శుక్రవారం మరణించారు. నటుడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆశిష్ (Actor Ashish Warang) మరణ వార్త తెలిసి సన్నిహితులు, అభిమానులు షాకవుతున్నారు. దర్శకనిర్మాత అరిణ్ పాల్ సోషల్ మీడియా వేదికగా నటుడి మృతి పట్ల సంతాపం ప్రకటించాడు.
మృదుస్వభావి
ఆశిష్ చనిపోయారని తెలిసి షాకయ్యాను. ఆయనతో కలిసి పనిచేసే అదృష్టం నాకు లభించినందుకు గర్వంగా ఉంది. ఆయన మృదుస్వభావి, కళపట్ల అంకితభావంతో మెదిలేవాడు. ప్రతి సీన్‌లోనూ ప్రాణం పెట్టి యాక్ట్ చేసేవాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. కాగా ఆశిష్.. అక్షయ్‌కుమార్ 'సూర్యవంశీ', అజయ్ దేవ్‌గణ్ 'దృశ్యం' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. రాణి ముఖర్జీ 'మర్దానీ' సినిమాలోనూ తన నటనతో ఆకట్టుకున్నాడు. హిందీలోనే కాకుండా మరాఠీ చిత్రాల్లోనూ యాక్ట్ చేశాడు.