
ఓటీటీల్లో హారర్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ జోనర్ చిత్రాలకు ఆడియన్స్ నుంచి విపరీతమైన ఆదరణ వస్తోంది. ఇలాంటి చిత్రాలు చూసేందుకు ఓటీటీ ప్రియులు ఎప్పుడు ఆసక్తి చూపిస్తుంటారు. 2023లో విడుదలై నేషనల్ అవార్డ్ దక్కించుకున్న హారర్ మూవీ వాష్. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. గుజరాతీలో తెరకెక్కించిన ఈ సినిమాను హిందీలోనూ రిలీజ్ చేశారు.
ఈ చిత్రానికి సీక్వెల్‌గా వాష్ లెవెల్-2 మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ ఏడాది ఆగస్టు 27న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. రిలీజైన రెండు నెలల్లోపే డిజిటల్‌గా స్ట్రీమింగ్ కానుంది. ఈనెల 22 నుంచే నెట్‌ఫ్లిక్స్ వేదికగా సందడి చేయనుంది. గుజరాతీ భాషతో పాటు హిందీలోనూ అందుబాటులోకి రానుంది. అయితే సౌత్ భాషల్లో మాత్రం స్ట్రీమింగ్ కావడం లేదు. కాగా.. ఈ చిత్రానికి కృష్ణదేవ్ యాగ్నిక్ దర్శకత్వం వహించారు.
Darr ka mahaul hai. Iss baar bachna hoga mushkil 👀
Watch Vash Level 2, out 22 October, on Netflix.#VashLevel2OnNetflix pic.twitter.com/5fIrKyBR5J— Netflix India (@NetflixIndia) October 21, 2025