
విలక్షణ నటుడు సోనూసూద్ (Sonu Sood) ప్లాట్ కొనుగోలు చేశాడు. కుమారుడు ఇషాన్‌తో కలిసి ముంబై పన్వేల్‌లోని 777 చదరపు గజాల భూమిని తన సొంతం చేసుకున్నాడు. దీనికోసం రూ.1.09 కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ కోసం రూ.30 వేలు, స్టాంప్‌డ్యూటీ కింద రూ. 6.3 లక్షలు చెల్లించాడు. ముంబై-పుణె మార్గంలో పన్వేల్ ప్రాంతం ఉంది. పన్వేల్‌లో ఐటీ సంస్థలు, విద్యా సంస్థలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు రాబోతున్నాయి.
ఇటీవలే అపార్ట్‌మెంట్ కొనుగోలు
ముంబై రెండో అంతర్జాతీయ విమానాశ్రయం (Navi Mumbai International Airport) కూడా మరికొద్ది నెలల్లో ప్రారంభం కానుంది. కాగా సోనూసూద్ కుమారుడు ఇషాన్.. ఇటీవల ఆగస్టులో సైతం ముంబైలోని అంధేరి వెస్ట్‌లో ఓ అపార్ట్‌మెంట్ కొన్నాడు. దీనికోసం రూ. 2.6 కోట్లు ఖర్చు చేశాడు. అదే నెలలో సోనూసూద్.. ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలో తన అపార్ట్‌మెంట్‌ను రూ.8.10 కోట్లకు అమ్మేశాడు. దీన్ని 2012లో రూ.5 కోట్లకు కొనుగోలు చేయగా దాదాపు 13 ఏళ్ల తర్వాత 8 కోట్లకు అమ్మేశాడు.
సినిమా
సినిమాల విషయానికి వస్తే.. సోనూసూద్ చివరగా ఫతే సినిమాలో నటించాడు. స్వీయదర్శకత్వంతో పాటు సోనూసూద్ హీరోగా, నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోలేకపోయింది. ఇతడు పుష్కరకాలం క్రితం నటించిన తమిళ మూవీ మదజగరాజ మాత్రం జనవరిలో రిలీజై సూపర్ హిట్ అందుకుంది.