
అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్, టబు లీడ్ రోల్స్‌లో నటించిన బాలీవుడ్ చిత్రం ‘దే దే ప్యార్ దే’. అకివ్ అలీ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ 2019లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా దే దే ప్యార్ దే 2 తెరకెక్కించారు. ఈ చిత్రంలో మరోసారి రకుల్, అజయ్ కనిపించనుండగా.. టబు మాత్రం నటించడం లేదు. అయితే సీక్వెల్‌కు అన్షుల్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే ఫుల్ రొమాంటిక్ కామెడీగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అజయ్ దేవగణ్, రకుల్ మధ్య కామెడీ సీన్స్ నవ్వులు తెప్పిస్తున్నాయి. మీ బాయ్‌ఫ్రెండ్ వయస్సు.. మీ నాన్న వయసంత ఉంటే.. అంటూ ట్రైలర్‌ను పోస్ట్ చేసింగి రకుల్ ప్రీత్ సింగ్. కాగా.. ఈ చిత్రంలో ఆర్ మాధవన్, మీజాన్ జాఫ్రీ, ఇషితా దత్తా, గౌతమి కపూర్ కీలక పాత్రలు పోషించారు. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం చిల్ర్డన్స్ డే సందర్భంగా నవంబర్ 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి లవ్ రంజన్ కథను అందించడంతో పాటు టి-సిరీస్ భూషణ్ కుమార్‌తో కలిసి సహ నిర్మాతగా వ్యవహరించారు.
When your BF is your dad’s age and not yours, you know it’s time for a #PyaarVsParivaar showdown! 🥊#DeDePyaarDe2 Trailer out now 👇https://t.co/y9YQB8wFLm
Releasing In cinemas Nov 14 🎟️@ajaydevgn @ActorMadhavan #MeezaanJafri @anshul3112 @luv_ranjan @gargankur #TarunJain… pic.twitter.com/WoFj2WHp21— Rakul Singh (@Rakulpreet) October 14, 2025