
బిగ్‌బాస్ 9 నుంచి దమ్ము శ్రీజ ఎలిమినేషన్ గురించి సోషల్‌మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది. ఆడియన్స్ ఓట్స్‌తో సంబంధం లేకుండా ఆమెను హౌస్ నుంచి పంపించేయడంతో షో పట్ల విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్‌లలో శ్రీజ చాలా స్ట్రాంగ్ అని షో చూస్తున్న వారికి ఎక్కువగా అభిప్రాయం ఉంది. టోటల్లీ అన్‌ఫెయిర్ బిగ్‌బాస్ అంటూ కొందరు.. ఇదంతా దొంగాట అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
వాస్తవంగా శ్రీజ ఆట మొదటి రెండు వారాలు పరమ చెత్తగా ఉండేది. అయితే, ప్రియ ఎలిమినేషన్ తర్వాత తన పంతా పూర్తిగా మార్చేసుకుంది. ఒక శివంగిలా ప్రతి టాస్క్‌లలో దూసుకుపోయింది. ఎదురుగా ఎంత మంది ఉన్నా సరే సమాధానం చెబుతుంది. ఇలా స్ట్రాంగ్ కంటెస్టెంటుగా తనను తాను మార్చుకుంది. కానీ, హౌస్‌లోకి కొత్తగా అడుగుపెట్టిన వైల్డ్ కార్డ్ ఎంట్రీల అభిప్రాయంతో ఆమెను తరిమేయడం ఏంటి అంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు. హౌస్‌లోకి వచ్చిన ఆరుగురిలో నలుగురు శ్రీజ వద్దు అనగానే ఇలా పంపించేయడం ఏంటి..? అలాంటప్పుడు ఓట్లు, పోల్స్, వీకెండ్‌లో నాగార్జున షో ఎందుకు అంటూ నెటిజన్లు మండి పడుతున్నారు.
ప్రజాభిప్రాయం అనేది లేనప్పుడు ఈ షో ఎందుకు అంటూ బిగ్‌బాస్‌ను తప్పుబడుతున్నారు. బిగ్‌బాస్‌లోకి ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన ఆమె జర్నీని కూడా చూపించకుండా చాలా అవమానకరంగా ఇలా గెంటేయడం ఏంటి దుమ్మెత్తిపోస్తున్నారు. సర్ఫ్ ఎక్సెల్‌తో కడిగినా సరే బిగ్‌బాస్ చరిత్రలో ఈ మరక పోదని అంటున్నారు. మా ఇష్టం వచ్చిన వాల్లను ఇంటికి పంపించేస్తామనే దోరణిలో తెలుగు బిగ్‌బాస్ ఉంది. కేవలం రేటింగ్ కోసమే కామనర్స్‌ను తీసుకున్నారా.. ఏడుగురు హౌస్‌లోకి వెళ్తే ఇప్పటికే నలుగురు ఇంటి బాట పట్టించారు. కనీసం శ్రీజకు రీఎంట్రీ ఛాన్స్ ఇచ్చి హౌస్‌లోకి రప్పించాలని , అలాగైన బిగ్‌బాస్ తన గౌరవాన్ని కాపాడుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
రీఎంట్రీపై దమ్ము శ్రీజ కామెంట్
శ్రీజ ఎలిమినేషన్ వంద శాతం కావాలనే చేశారని ఎవరైనా చెబుతారు. దీంతో ఆమె రీ ఎంట్రీ కోసం చాలా సోషల్ మీడియా ఖాతాలు ఓటింగ్ పెట్టాయి. ప్రతి దానిలో ఆమె రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నట్లు తీర్పు ఇచ్చారు. ఈ క్రమంలోనే రీ ఎంట్రీ గురించి ఆమె ఇలా మాట్లాడారు. దేవుని దయ వల్ల రీ ఎంట్రీ వుంటే తప్పకుండా హౌస్‌లోకి వెళ్తాను. నా కోసం ఇంత సపోర్ట్ ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు. సామాన్యులకు హౌస్‌లోకి వెళ్లేందుకు అవకాశం ఇచ్చిన బిగ్‌బాస్‌కు ధన్యవాదాలు. నేను ఎలిమినేషన్ అవుతానని కూడా ఊహించలేదు. సీక్రెట్ రూమ్ ఉంటుంది అనుకున్నాను. ఎప్పుడైతే నన్ను బజ్ ప్రోగ్రామ్‌కు పంపించారో అర్థం అయింది. సడెన్‌గా తీసుకున్న నిర్ణయం వల్ల నా జర్నీని కూడా టెలికాస్ట్ చేయలేదు. అని శ్రీజ అన్నారు.