
అక్క అంటే అమ్మ తర్వాత అమ్మ! ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది బిగ్‌బాస్ బ్యూటీ, నటి వితికా షెరు (Vithika Sheru). చెల్లి కృతికను చంటిపాపలా చూసుకుంటుంది. తన పెళ్లి కూడా వితిక చేతుల మీదుగానే జరిగింది. 2022లో కృతిక- కృష్ణల వివాహం ఎంతో ఆడంబరంగా, కన్నులపండగ్గా జరిగింది. రెండు రోజుల క్రితం కృతిక.. తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. బేబీ బంప్ ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది.
చెల్లెలికి సర్‌ప్రైజ్
వితికాకు అసలే సర్‌ప్రైజ్‌లంటే చాలా ఇష్టం. తన భర్తను, ఫ్రెండ్స్‌ను ఎప్పుడూ ఏదో ఒకరంగా సర్‌ప్రైజ్ చేస్తూ ఉంటుంది. ఈసారి చెల్లెలికి ఊహించని కానుకనిచ్చింది. అదే ఆమె సీమంతం. ఒక గదిని అందంగా డెకరేట్ చేసి చెల్లెలి సీమంతం జరిపింది. ఫ్రెండ్స్, కజిన్స్ సమక్షంలో సర్‌ప్రైజ్ సీమంతం జరుపుకోవడంతో కృతిక మనసు సంతోషంతో నిండిపోయింది.

పెద్దమ్మ గిఫ్ట్
వీళ్లంతా కలిసి చిన్నపాటి బేబీ డ్రెస్‌పై బొమ్మలు పెయింట్ వేశారు. వితిక అయితే అక్షరాభ్యాసానికి రెడీగా టీషర్ట్‌పై తెలుగు అక్షరాలను గీసింది. అందులో పెద్దమ్మ అనే అక్షరాలను పొందుపరిచి వాటిని అండర్‌లైన్ చేసింది. అందుకు సంబంధించిన వీడియోను వితికా అభిమానులతో పంచుకుంది. అది చూసిన అభిమానులు.. మీ ఓపికను మెచ్చుకుని తీరాల్సిందే! అవతలివారి సంతోషంలో మీ ఆనందాన్ని వెతుక్కుంటారు, గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.