 
													హౌస్‌లో ఒక్కొక్కర్ని చెడుగుడు ఆడేసుకుంటోంది దివ్వెల మాధురి (Divvala Madhuri). తనకు ఎదురు తిరిగినవారిని మాటల ప్రవాహంతోనే దడదడలాడిస్తోంది. ఆమె నోట్లో నోరు పెట్టడమంటే సింహం బోనులో వెళ్లి కూర్చోవడమే అవుఉతంది! అలాంటి మాధురిని పిల్లిని చేశాడో కంటెస్టెంట్. అతడెవరో కాదు, కామెడీ కింగ్, టాస్కుల వీరుడు ఇమ్మాన్యుయేల్..
మాధురితో గుంజీలు తీయించిన ఇమ్మూ
మాధురి సైలెంట్ అయిపోయిందంటే ఏదో తప్పు చేసే ఉంటుంది. లేకపోతే పిల్లిలా ఎందుకు మారిపోతుంది! ఈరోజు రిలీజ్ చేసిన ప్రోమోలో ఆమె తప్పుల్ని, ఆమెకిచ్చిన పనిష్మెంట్స్‌ను చూచాయగా చూపించారు. అందులో ఆమె పొద్దెక్కినా కూడా నిద్రపోతోంది. దీంతో కుక్కలు మొరిగాయి. కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ ఆమెతో 20 గుంజీలు తీయించాడు. అయినా మాధురికి నిద్ర ఆగితే కదా.. మళ్లీ కునుకు తీస్తూనే ఉంది. దీంతో ఆమెతో పచ్చిమిర్చి తినిపించాడు.

మరీ ఓవర్ చేస్తున్నారు
ఇక మరో ప్రోమోలో తనూజ, పవన్ గొడవపడ్డారు. రాత్రి బెండకాయ వద్దని పవన్.. నువ్వు ఎక్స్‌ట్రాలు మాట్లాడకు, నువ్వెవరు చెప్పడానికి.. నీలాగా ఎవరూ చేయట్లేదు అని ఒంటికాలిపై లేచింది. అటు దివ్య కూడా కాఫీ విషయంలో రీతూపై అరిచింది. ఈ గొడవలు చూస్తున్న జనాలు.. భరణి నాన్న వచ్చాక వీళ్లిద్దరూ మరీ ఓవర్ చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. అసలు తనూజను రేషన్ మేనేజర్‌గా తీసేయండ్రా బాబూ అని గగ్గోలు పెడుతున్నారు.
చదవండి: వాళ్లందరూ సర్వనాశనం అయిపోతారు.. మంచు లక్ష్మి శాపనార్థాలు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
