
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లో కొత్త కెప్టెన్‌ను ఎన్నుకునే సమయం ఆసన్నమైంది. అయితే దానికంటే ముందు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన దివ్య నిఖితకు బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. ఇంటిసభ్యులను వారి ఆట,మాట ఆధారంగా వరుస ర్యాంకుల్లో నిల్చోబెట్టమన్నాడు. దాదాపు ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో అలాగే హౌస్‌మేట్స్‌కు ర్యాంకులిచ్చింది. రెండుమూడు మాత్రం కాస్త అటుఇటుగా ఉన్నాయి.
ర్యాంకింగ్..
భరణిని టాప్ 1లో, ఇమ్మాన్యుయేల్‌ను రెండో స్థానంలో, సంజనాను మూడు, డిమాన్ పవన్‌ను నాలుగు, తనూజను ఐదో స్థానంలో నిలబెట్టింది. సుమన్, రీతూ, ప్రియ, హరీశ్, శ్రీజ, కల్యాణ్, రాము, ఫ్లోరాకు వరుసగా ఆరు నుంచి 13 స్థానాలిచ్చింది. దివ్య ఇచ్చిన ర్యాంకింగ్స్ ప్రకారం టాప్ 5లో ఉన్నవారు మాత్రేమ కెప్టెన్సీకి పోటీ పడతారని ప్రకటించాడు బిగ్‌బాస్.
కెప్టెన్సీ టాస్క్
వీరితోపాటు దివ్యను కూడా కంటెండర్‌గా అనౌన్స్ చేశాడు. వీళ్లకు తప్పిస్తారా? గెలిపిస్తారా? అన్న గేమ్ పెట్టాడు. ఈ గేమ్‌లో భరణి, ఇమ్మాన్యుయేల్ చివరి వరకు పోరాడారు. హౌస్‌మేట్స్ సహకారంతో ఇమ్మాన్యుయేల్ గెలిచి కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు కెప్టెన్సీకి పోరాడి ఓడియాడు. మూడోసారి మాత్రం గెలిచి దక్కించుకున్నాడు. మరి ఇమ్మాన్యుయేల్‌ను కెప్టెన్‌గా ప్రకటించేశారా? లేదంటే బిగ్‌బాస్ మళ్లీ ఏదైనా ట్విస్ట్ ఇచ్చాడా? అన్నది ఎపిసోడ్‌లో చూడాలి!
చదవండి: చెల్లికి ఊహించని సర్‌ప్రైజ్.. సీమంతంతోపాటు బేబీకి ఓ గిఫ్ట్