
‘జబర్దస్త్’ ఫేమ్ యాదమ్మ రాజు, గల్లీబాయ్ భాస్కర్, ఇమ్మాన్యుయేల్, బల్వీర్ సింగ్, గడ్డం నవీన్, పవన్ శెట్టి, రాజేష్ ధృవ, రాధిక అచ్యుత్ రావు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భూతం ప్రేతం’. రాజేష్ ధృవ దర్శకత్వంలో బి. వెంకటేశ్వర రావు నిర్మించారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ను డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘భూతం ప్రేతం’ టైటిల్, ఫస్ట్ లుక్ చాలా బాగున్నాయి. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
‘‘హారర్ కామెడీ నేపథ్యంలో రూ΄÷ందిన చిత్రం ‘భూతం ప్రేతం’. ఐదుగురు కుర్రాళ్లు అనుకోకుండా భూతానికి చిక్కుకుంటారు. ఆ తర్వాత ఆ భూతం నుంచి వారు ఎలా బయటపడ్డారు? అన్నది కథ. మా చిత్రం ప్రేక్షకులను నవ్విస్తుంది... భయపెడుతుంది. ఈ ఏడాదిలోనే మా సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: గిరీష్ హోతుర్, కెమెరా: యోగేష్ గౌడ.