breaking news
Sudigali Sudheer
-
సుడిగాలి సుధీర్ ‘గోట్(GOAT)’ సినిమా టీజర్ రిలీజ్ (ఫొటోలు)
-
'అమ్మాయిని ఎత్తుకొస్తే పది లక్షలు'.. నవ్వులు తెప్పిస్తోన్న టీజర్..!
జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం గోట్(GOAT). కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో దివ్య భారతి హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది.ఇవాళ గోట్ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పెళ్లి ఇష్టం లేని అమ్మాయి.. తనను ఎత్తుకొస్తే పది లక్షలు ఇస్తానంది.. ఐదు నీకు.. ఐదు నాకు అంటూ బ్రహ్మజీ చెప్పిన డైలాగ్ తెగ నవ్వులు తెప్పిస్తోంది. కాగా.. ఈ సినిమాను జైష్ణవ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మొగుళ్ల చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. -
క్రికెట్ నేపథ్యంలో సుడిగాలి సుధీర్ G.O.A.T.. రంగంలోకి టాప్ టెక్నీషియన్!
‘సుడిగాలి’ సుధీర్, దివ్య భారతి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘జీవోఏటీ’. క్రికెట్ నేపథ్యంలో వినోద ప్రధానంగా సాగే ఈ సినిమాను మొగుళ్ళ చంద్రశేఖర్ నిర్మించారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. అయితే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను మాత్రం ప్రముఖ సంగీతదర్శకుడు మణిశర్మ అందించనున్నారు. ఈ విషయాన్ని చిత్రనిర్మాత శనివారం అధికారికంగా తెలిపారు. ఇటివలే రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ఒడియమ్మ సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. లియోన్ జేమ్స్ ఈ పాటని అదిరిపోయే లవ్ మెలోడీ గా కంపోజ్ చేశారు. సుధీర్(Sudigali Sudheer) కెరీర్లో ఇంత వేగంగా వైరల్ అయిన పాట ఇదే అనే చెప్పాలి. రిలీజ్ అయిన ఒక్క రోజులోనే రికార్డు స్థాయి వ్యూస్‌తో దూసుకుపోయి, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పటివరకు విడుదలైన అన్ని పాటలు హిట్ అంటూ ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన అందుకుంటున్నాయి. దీంతో సినిమా పై బజ్ మరింతగా పెరిగింది.


