గణ గుణాలేంటి? అతను తీరేంటి? అంటే ‘రైజ్ ఆఫ్ గణ’ పాట వినాల్సిందే. గణ పాత్రలో సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన చిత్రం ‘గోట్’. దివ్యభారతి హీరోయిన్‌గా నటించారు. వేదవ్యాస్ దర్శకత్వంలో మహాతేజ క్రియేషన్స్, జైష్ణవ్ ప్రోడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మాత.
ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది. సోమవారం ఈ చిత్రం నుంచి ‘రైజ్ ఆఫ్ గణ’ పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ‘‘హీరో క్యారెక్టరైజేషన్, అతని గుణాలు, తీరు తెలిపే విధంగా పవర్‌ఫుల్ సాంగ్‌లా ఉంటుంది. సుడిగాలి సుధీర్ కెరీర్‌లో ఈ చిత్రం మైల్‌స్టోన్‌గా నిలుస్తుంది’’ అని నిర్మాత అన్నారు.


