జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం గోట్(GOAT). కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో దివ్య భారతి హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది.
ఇవాళ గోట్ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పెళ్లి ఇష్టం లేని అమ్మాయి.. తనను ఎత్తుకొస్తే పది లక్షలు ఇస్తానంది.. ఐదు నీకు.. ఐదు నాకు అంటూ బ్రహ్మజీ చెప్పిన డైలాగ్ తెగ నవ్వులు తెప్పిస్తోంది. కాగా.. ఈ సినిమాను జైష్ణవ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై మొగుళ్ల చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు.


