క్రికెట్‌ నేపథ్యంలో సుడిగాలి సుధీర్ G.O.A.T.. రంగంలోకి టాప్‌ టెక్నీషియన్‌! | Mani Sharma Provide BAckground Music For Sudigali Sudheer GOAT Film | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ నేపథ్యం సుడిగాలి సుధీర్‌ సినిమా... రంగంలోకి టాప్‌ టెక్నీషియన్‌!

Nov 30 2025 10:42 AM | Updated on Nov 30 2025 12:26 PM

Mani Sharma Provide BAckground Music For Sudigali Sudheer GOAT Film

‘సుడిగాలి’ సుధీర్, దివ్య భారతి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘జీవోఏటీ’. క్రికెట్‌ నేపథ్యంలో వినోద ప్రధానంగా సాగే ఈ సినిమాను మొగుళ్ళ చంద్రశేఖర్‌ నిర్మించారు. ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది.

 ఈ చిత్రానికి లియోన్‌ జేమ్స్‌ సంగీతం అందించారు. అయితే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ను మాత్రం ప్రముఖ సంగీతదర్శకుడు మణిశర్మ అందించనున్నారు. ఈ విషయాన్ని చిత్రనిర్మాత శనివారం అధికారికంగా తెలిపారు. 

ఇటివలే రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ఒడియమ్మ సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. లియోన్ జేమ్స్ ఈ పాటని అదిరిపోయే లవ్ మెలోడీ గా కంపోజ్ చేశారు.  సుధీర్(Sudigali Sudheer) కెరీర్‌లో ఇంత వేగంగా వైరల్ అయిన పాట ఇదే అనే చెప్పాలి. రిలీజ్ అయిన ఒక్క రోజులోనే రికార్డు స్థాయి వ్యూస్‌తో దూసుకుపోయి, సోషల్ మీడియాలో  ట్రెండ్ అవుతోంది. ఇప్పటివరకు విడుదలైన అన్ని పాటలు హిట్ అంటూ ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన అందుకుంటున్నాయి. దీంతో సినిమా పై బజ్ మరింతగా పెరిగింది.

 

Advertisement
 
Advertisement
Advertisement