మంచి సినిమాల కోసం పక్క భాషల వైపు చూసే తెలుగు ప్రేక్షకులను ఉద్దేశించి చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘సమ్మర్ హాలిడేస్’ సక్సెస్ మీట్ వేదికగా మాట్లాడాడు. మన దగ్గరే అద్భుతమైన కథలు ఉన్నప్పుడు వాటిని థియేటర్లలో చూడకుండా వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
బంగారం కోసం వెతుకుతూ..
‘సోషల్ మీడియాలో ఒక కొటేషన్ తరచూ చూస్తుంటాం.. బంగారం కోసం వెతుకుతూ చేతిలో ఉన్న డైమండ్‌ను పోగొట్టుకున్నామని! మన పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. మంచి కంటెంట్ కోసం ఎక్కడెక్కడో చూస్తూ.. మన దగ్గరే ఉన్న ‘సమ్మర్ హాలిడేస్’ లాంటి ఒక డైమండ్ సినిమాను థియేటర్లలో చూడకుండా వదిలేస్తున్నారు’ అని అన్నాడు.
సినిమా చూసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురవుతున్నారని కానీ మూవీ చూసేందుకు చాలా తక్కువ మంది థియేటర్లకు వెళ్తున్నారని తెలిపాడు. కనీసం మౌత్ పబ్లిసిటీ కోసమైనా థియేటర్లకు వెళ్లాలని పిలుపునిచ్చాడు.
(ఇదీ చదవండి: నాగచైతన్య ‘వృషకర్మ’ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది)
#RagalahariExclusive: "Chasing Tamil & Malayalam gold, we're ignoring our own Telugu diamonds!" 🚨👀 #SummerHolidays star Rohan calls out the audience trend of looking outside while rooted, heartwarming Telugu gems miss the spotlight they deserve. #SummerHolidaysMovie #TollywoodNews #TeluguCinemaUpdates #BoxOfficeTalk
— Ragalahari (@Ragalahariteam) November 7, 2026


