హీరోగా 'ద ప్యారడైజ్' చేసిన నాని.. నిర్మాతగా 'అలియాస్ రుక్మిణీ' అనే మూవీ చేస్తున్నాడు. నితిన్ హీరో కాగా 'దండోరా' తీసిన మురళీకాంత్ దేవసోత్ దర్శకుడు. డిసెంబరు 04న థియేటర్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ఈ మధ్యే ప్రకటించారు. అయితే టైటిల్‌లో ఉన్నట్లు రుక్మిణీ పాత్ర చేస్తున్న హీరోయిన్ ఎవరా అనే సస్పెన్స్‌కి తెరదించారు. ఈ మేరకు ఓ వీడియోని వదిలారు.
(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి క్రేజీ సినిమా.. మహిళలు తప్పక చూడాలి)
బాలీవుడ్ బ్యూటీ ఆఫియా సయ్యద్.. 'అలియాస్ రుక్మిణీ' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈమె చేసిన తొలి హిందీ మూవీ 'ప్రేమకీతను' ఈ నెల ప్రారంభంలోనే రిలీజైంది. దక్షిణాది సూపర్ హిట్ 'ప్రేమలు'కి రీమేక్ ఇది. తాజాగా వదిలిన 'అలియాస్ రుక్మిణీ' టీజర్‌లో ఈమెని చూస్తుంటే అందంగా ఉంది! ఆఫియా వ్యక్తిగత విషయానికొస్తే బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సాజిద్ నడియావాలాకు ఈమె మేనకోడలు అవుతుంది.
(ఇదీ చదవండి: 'రాజాసాబ్' సినిమా.. అలా చేయకుండా ఉండాల్సింది: నిర్మాత)


