‘ఆ డైరెక్టర్లు క్రిమినల్స్‌తో సమానం.. వారిని బ్యాన్‌ చేయాలి’ | Such Directors Are Criminals to Cinema Kona Venkat Fires on Wasteful Filmmakers | Sakshi
Sakshi News home page

Kona Venkat Fire: ‘రూ. కోట్లు వృథా.. వారిని బ్యాన్‌ చేయాలి’

Oct 10 2026 6:29 PM | Updated on Oct 10 2026 7:02 PM

Such Directors Are Criminals to Cinema Kona Venkat Fires on Wasteful Filmmakers

తాజాగా శ్రీవిష్ణు హీరోగా, కోన వెంకట్ సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్, స్కంద వాహన మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై సంయుక్తంగా రూపొందిన  చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కోన వెంకట్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని  ఆసక్తికరమైన కామెంట్స్‌ చేశారు. ఇప్పుడీ కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

‘దాదాపు 3 గంటల 50 నిమిషాలతో సినిమా తీసి, ఆ తర్వాత ఎడిటింగ్ లో  ఏకంగా 1 గంట 50 నిమిషాల ఫుటేజీని కట్‌ చేసేస్తే ఏం ఉపయోగం?. అలాంటప్పుడు అంత ఖర్చు పెట్టి తీయడం ఎందుకు, మళ్లీ దాన్ని కట్ చేయడం ఎందుకు?" అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ‘ఆ తొలగించిన గంటన్నర ఫుటేజీ తీయడానికి రూ.కోట్లు ఖర్చవుతాయి. ఆ వృథా అయ్యే రూ.కోట్లు ఎవరివి?, అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టిన నిర్మాతవి కాదా?.. ఆ డబ్బంతా నిర్మాత కుటుంబానికి చెందినవి కాదా?, హిట్‌ ప్లాప్‌లతో డైరెక్టర్‌కి సంబంధం లేదు. అయితే దాన్ని ప్లాన్‌ చేయాల్సి పని డైరెక్టర్‌దే. అలాంటి వాళ్లని ఇండస్ట్రీలో బ్యాన్‌ చేయాలి’ అని మండిపడ్డారు. 

 (ఇదీ చదవండి: రాజమౌళికి సిగ్గు ఎక్కువ.. మా ప్రేమ అలా మొదలైంది: రమా రాజమౌళి )

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement