మా కామ్రేడ్‌ నవ్విస్తాడు  | Director Janakiram Marella talks about Comrade Kalyan movie pressmeet | Sakshi
Sakshi News home page

మా కామ్రేడ్‌ నవ్విస్తాడు 

Oct 8 2026 1:02 AM | Updated on Oct 8 2026 1:02 AM

Director Janakiram Marella talks about Comrade Kalyan movie pressmeet

– డైరెక్టర్‌ జానకిరామ్‌ మారెళ్ల 

‘‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ సినిమా ఒరిస్సా–ఆంధ్ర బోర్డర్‌లో జరిగే కథ. మంచి ఎంటర్‌టైనర్‌. మా కామ్రేడ్‌ అందర్నీ నవ్విస్తాడు. శ్రీ విష్ణుగారి బలం ఎంటర్‌టైన్‌మెంట్‌. అది ఈ మూవీలో స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఒక సమస్యలో ఉన్న వ్యక్తి అటువైపు వెళ్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది వినోదాత్మకంగా ఉంటుంది. ఈ సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారు’’ అని డైరెక్టర్‌ జానకిరామ్‌ మారెళ్ల తెలిపారు. 

శ్రీ విష్ణు హీరోగా, మహిమా నంబియార్‌ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’. కోన వెంకట్‌ సమర్పణలో  వెంకటకృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా జానకిరామ్‌ మారెళ్ల విలేకరులతో మాట్లాడుతూ– ‘‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టైటిల్‌ కథ నుంచే వచ్చింది.

 ఈ టైటిల్‌పై సెన్సార్‌ బోర్డ్‌ నుంచి తొలుత అభ్యంతరం ఎదురైంది. అయితే సినిమా చూశాక టైటిల్‌ ఎందుకు పెట్టామన్నది వారికి అర్థం అయింది. శ్రీ విష్ణుగారు చాలా సపోర్ట్‌ చేశారు. ఆయన అమ్మ పాత్రలో రాధికగారి నటన చాలా కీలకం. సత్య, షైన్‌ టామ్‌ చాకో పాత్రలూ బాగుంటాయి. కోన వెంకట్‌గారి సపోర్ట్‌ కూడా మరచిపోలేను’’ అని పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement