తొలి సినిమాతోనే సక్సెస్ అందుకుని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కొందరికి అలా జరిగిపోతూ ఉంటుంది. ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీతో దర్శకుడు జానకిరామ్ మారెళ్ల ఇలా తన ప్రతిభ చాటుకున్నారు. సింపుల్ వన్‌లైనర్స్, సహజమైన సంభాషణలు, సందర్భానుసారంగా వచ్చే కామెడీతో థియేటర్లలో ప్రేక్షకులను నవ్వించారు. భారీ కామెడీ సన్నివేశాలపై ఆధారపడకుండా, సాధారణ సన్నివేశాలతోనే వినోదాన్ని పంచడంలో సక్సెస్ అయ్యారు.
(ఇదీ చదవండి: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ రివ్యూ)
కామెడీ మాత్రమే కాకుండా, కమర్షియల్ యాక్షన్ సీక్వెన్స్‌లను కూడా జానకిరామ్ అద్భుతంగా తెరకెక్కించారు. తన గురువు, దర్శకుడు బాబీ తరహాలోనే యాక్షన్ సన్నివేశాలను రిచ్‌గా, ఆకట్టుకునే విజువల్స్‌తో రూపొందిస్తూ తనలోని టేకింగ్ స్కిల్‌ను చాటుకున్నారు. కామెడీ టైమింగ్‌తో నవ్వులు పంచుతూనే, యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపడం ఆయన దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం.
తొలి సినిమాతోనే వినోదానికి పెద్దపీట వేస్తూ, కథను ఆసక్తికరంగా తెరకెక్కించిన విధానంతో జానకిరామ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేక్షకులను మెప్పించేలా సన్నివేశాలను తీర్చిదిద్దడంలో తనకున్న పట్టుని ప్రూవ్ చేసుకున్నారు. కామెడీ, యాక్షన్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఒక కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్ను అందించడంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు.
‘కామ్రేడ్ కళ్యాణ్’ విజయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్న జానకిరామ్.. ఇదే టాలెంట్‌ను కొనసాగిస్తే భవిష్యత్తులో మరిన్ని ఆసక్తికరమైన సినిమాలతో అలరించే అవకాశం ఉంది. తొలి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన తదుపరి ప్రాజెక్టులపై ఇప్పుడు అంచనాలు పెరిగాయి.
(ఇదీ చదవండి: జైలర్ 2 వర్సెస్ రణబాలి.. అదొక్కటే పెద్ద మైనస్..!)


