‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌ | Comrade Kalyan Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

Oct 9 2026 6:23 AM | Updated on Oct 9 2026 6:48 AM

Comrade Kalyan Movie Review And Rating In Telugu

కోన వెంకట్ సమర్పణలో వెంటక కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. భాను, నందు రచయితలుగా జానకిరామ్ మారెళ్ల తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రీవిష్ణు, మహిమా నంబియార్, రాధికా శరత్ కుమార్, షైన్ టాం చాకో, ఉపేంద్ర లిమాయే ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 9న ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చారు. మరి ఈ సినిమా కథ ఏంటి? ఎలా ఉంది? అన్నది ఓ సారి చూద్దాం.

కథ ఏంటంటే?
1994 నేపథ్యంలో సాగే ఈ కథ మాడుగుల అనే ప్రాంతంలో జరుగుతుంది. ఆ ఊర్లోని థియేటర్‌లో ఆపరేటర్‌గా పని చేస్తుంటాడు కళ్యాణ్ (శ్రీ విష్ణు). కళ్యాణ్ తల్లి సరస్వతమ్మ బాలయ్య అభిమాని. ఎప్పుడూ ఏదో ఒక ఫ్యాన్ వార్ పెట్టుకుని పోలీస్ స్టేషన్‌కి వెళ్తుంటుంది. ఆమెని విడిపించేందుకు కళ్యాణ్ నానా తంటాలు పడుతుంటాడు. ఎప్పటికైనా థియేటర్‌కి యజమాని అవ్వాలని కళ్యాణ్ అనుకుంటాడు. అతని జీవితంలోకి సితార (మహిమా నంబియార్) ఒరియా అమ్మాయిగా వస్తుంది. భాష అడ్డంకిగా ఉందని తన ప్రేమను తెలిపేందుకు కళ్యాణ్ అష్టకష్టాలు పడుతుంటాడు. అయితే అలాంటి సమయంలోనే సితార తెలుగమ్మాయి అని తెలుస్తుంది. సితారకు బిష్వాస్ (ఉపేంద్ర లిమాయే) నుంచి ఆపద గురించి తెలుస్తుంది. ఆ ఆపద నుంచి సితారను బయట పడేసేందుకు కళ్యాణ్ కాస్త కామ్రేడ్ కళ్యాణ్ అవుతాడు. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది? కళ్యాణ్ చివరకు తన ప్రేయసిని తిరిగి చేరుకున్నాడా? అసలు ఈ కథలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్‌ జార్జ్ కుట్టి (షైన్ టాం చాకో), శంకరన్న (శత్రు), మాస్టర్ (సాయి చంద్), సత్తి బాబు (సత్య), పళ్లం రాజు (ప్రభాస్ శీను), ఎస్సై అప్పలనాయుడు (బ్రహ్మాజీ) పాత్రలు ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే.

ఎలా ఉందంటే?
ఓ సీరియస్ సబ్జెక్ట్‌ని ఎంత సిల్లీగా, కామెడీగా చెప్పాలో.. అంత సిల్లీగా, కామెడీగా చెప్పారు. తీసుకున్నది 90వ దశకం అయినా మాటలు, చేష్టలు అన్నీ కూడా ఈ జెన్ జీ బ్యాచ్‌కి తగ్గట్టుగా అనిపిస్తాయి. 90స్ బ్యాక్ డ్రాప్ అని చెప్పడం తప్పా.. మాటలు, కదలికలు, ఆ వాతావరణం ఎక్కడా కూడా కనిపించదు. చాలా వరకు డైలాగ్స్‌లో ద్వంద్వార్థాలు కనిపిస్తుంటాయి. పేరుకే 90వ దశకం కానీ.. ఈ కథ ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉంటుంది. నక్సలిజం, పోలీస్ వ్యవస్థ మధ్య ఎప్పుడూ ఓ సన్నని గీత ఉంటుంది. సినిమాల్లో ఎవరిది ఒప్పు? ఎవరిది తప్పు అని చెప్పలేం. చాలా సినిమాల్లో అన్నల్ని హీరోలుగా చూపించారు.. ఎన్నో సినిమాల్లో పోలీసుల్ని హీరోలుగా చూపించారు.

అయితే ఈ కామ్రేడ్ కళ్యాణ్ సినిమాని మాత్రం పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కించారు. ఆ కామెడీ ట్రాక్‌లో ఎమోషన్ నలిగిపోయినట్టు అనిపిస్తుంది. చివరకు మనం అన్నల సైడ్ గానీ, పోలీసుల సైడ్ గానీ ఆలోచించం. అసలు ఇందులో అలా ఆలోచించడానికి అంత ఆస్కారం కూడా ఇవ్వలేదు. మొత్తం శ్రీ విష్ణు, సత్య కామెడీతోనే లాగించేశారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా శ్రీ విష్ణు, సత్య, సుదర్శన్ డామినేషన్ కనిపిస్తుంది. సెకండాఫ్ అయినా ఎమోషనల్‌గా, కాస్త హార్ట్ టచింగ్‌గా ఉంటుందని అనుకుంటే.. అక్కడా మళ్లీ అదే సిల్లీ, లాజిక్ లెస్ కామెడీనే పెట్టారు. ఇక క్లైమాక్స్‌కి అటు వాళ్లు, ఇటు వీళ్లు అందరూ మంచివారు అయిపోతారు. హీరో ఇచ్చే స్పీచ్‌తో అందరూ మారిపోవడం మన తెలుగు సినిమాల్లో కామన్ అన్న సంగతి తెలిసిందే.

ఎవరెలా చేశారంటే..?
ఆర్టిస్టుల విషయానికి వస్తే శ్రీ విష్ణు ఎప్పటిలానే తనకు అలవాటైన పాత్రలో కనిపించి మెప్పిస్తాడు. తన వెరైటీ డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల్ని నవ్వించేస్తాడు.  సత్య కామెడీ టైమింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సుదర్శన్, ఉపేంద్ర, బలగం మురళీధర్ గౌడ్, శ్రీకాంత్ అయ్యంగార్ ఇలా అన్ని పాత్రలు నవ్విస్తాయి. హీరోయిన్‌గా మహిమా నంబియార్‌కి పెద్దగా ప్రాధాన్యం దక్కనట్టు అనిపిస్తుంది. షైన్ టాం చాకో పాత్ర కూడా కొత్తగా కనిపించదు. బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, రఘు బాబు ఇలా అందరూ తమ పరిధి మేరకు ఆకట్టుకుంటారు.

టెక్నికల్‌గా చూసుకుంటే విజువల్స్ బాగుంటాయి. కానీ 90స్ బ్యాక్ డ్రాప్ సినిమా అన్నట్టుగా మాత్రం కనిపించదు. తెరపై పాటలు బాగానే అనిపిస్తాయి. మాటలు మాత్రం 90వ దశకంలా కాకుండా.. ఇప్పటి జబర్దస్త్ ట్రెండ్, పంచ్ డైలాగ్స్‌లా అనిపిస్తాయి. ఆర్ట్, క్యాస్టూమ్, ఎడిటింగ్ ఇలా అన్నీ పర్వాలేదనిపిస్తాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement