పక్కింటి అమ్మాయి | Mahima Nambiar Entry Into Tollywood With Sree Vishnu Comrade Kalyan | Sakshi
Sakshi News home page

పక్కింటి అమ్మాయి

Oct 6 2026 4:58 AM | Updated on Oct 6 2026 4:58 AM

Mahima Nambiar Entry Into Tollywood With Sree Vishnu Comrade Kalyan

‘‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ సినిమాలో సితార దేవిగా పక్కింటి అమ్మాయిలాంటి పాత్ర చేశాను. అమాయకత్వం, వినోదాత్మకంగా ఉంటుంది. ఒరిస్సా నుంచి వచ్చిన అమ్మాయిగా కనిపిస్తాను. ఆ భాష కారణంగా హీరో, హీరోయిన్‌ మధ్య వచ్చే వినోదం చాలా గమ్మత్తుగా ఉంటుంది.

 ఒరిస్సాలో షూటింగ్‌ చేయడం సరికొత్త అనుభూతినిచ్చింది’’ అని మహిమా నంబియార్‌ తెలిపారు. శ్రీ విష్ణు హీరోగా జానకిరామ్‌ మారెళ్ల దర్శకత్వం వహించిన చిత్రం ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’. కోన వెంకట్‌ సమర్పణలో స్కంద వాహన మోషన్‌ పిక్చర్స్‌ ఎల్‌ఎల్‌పీపై వెంకట కృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది.

ఈ సందర్భంగా హీరోయిన్‌ మహిమా నంబియార్‌ విలేకరులతో మాట్లాడుతూ–‘‘నేను నటించిన మలయాళ, తమిళ సినిమాలు చూసిన జానకిరామ్‌గారు నాకు కాల్‌ చేసి ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ కథ చెప్పారు. శ్రీవిష్ణుతో నేను ‘సామజవరగమన’ సినిమా చేయాల్సింది. కానీ, కుదరలేదు. ఇప్పుడు ఈ సినిమాలో ఆయనతో నటించడం సంతోషంగా ఉంది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమా నిర్మించారు. ప్రస్తుతం మలయాళ, తమిళ్‌లో సినిమాలు చేస్తున్నాను.  తెలుగులో కథలు వింటున్నాను’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement