సూర్య సూపర్ 'సీన్'.. తొలిరోజు వసూళ్లు ఎన్ని కోట్లు? | Scene Movie Collection Day 1 Worldwide | Sakshi
Sakshi News home page

Scene Movie Collection: ఈ ఏడాది హ్యాట్రిక్ హిట్స్.. 'సీన్' కలెక్షన్ ఎంత?

Nov 7 2026 1:29 PM | Updated on Nov 7 2026 2:11 PM

Scene Movie Collection Day 1 Worldwide

ఈ ఏడాది సూర్య నామసంవత్సరంగా సాగుతుంది. ఎందుకంటే వేసవిలో ఓ సినిమాతో, వర్షాకాలంలో మరో మూవీతో.. ఇప్పుడు చలికాలంలో మరో చిత్రంతో వచ్చి వరసగా హిట్స్ కొట్టాడు. మరి లేటెస్ట్‌గా వచ్చిన 'సీన్'కి ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది? తొలిరోజు కలెక్షన్ ఎన్ని కోట్లు వచ్చాయ్?

(ఇదీ చదవండి: 'రామాయణ' తొలిరోజు కలెక్షన్ ఎన్ని కోట్లు?)

'ఆవేశం' లాంటి క్రేజీ మూవీ తీసిన దర్శకుడు జీతూ మాధవన్.. హీరో సూర్యతో కలిసి చేసిన తమిళ మూవీ 'సీన్'. నజ్రియా హీరోయిన్ కాగా నస్లేన్ విలన్‌గా చేశాడు. ప్రమోషనల్ కంటెంట్‌తోనే బజ్ వచ్చేలా చేశారు. సినిమా కూడా అందుకు తగ్గట్లే అదిరిపోయింది. అటు తమిళం, ఇటు తెలుగు నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కామెడీ క్రైమ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ చిత్రం చాలామందిని అలరిస్తోంది.

ఇకపోతే తొలిరోజు ఈ సినిమాకు రూ.19.15 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. తమిళం నుంచి రూ.16.15 కోట్లు రాగా తెలుగు నుంచి రూ.3 కోట్ల మొత్తం రాబట్టినట్లు సమాచారం. ప్రస్తుతానికి టాక్ బాగుంది. దీపావళి సెలవులు కూడా కలిసొచ్చాయి కాబట్టి వీకెండ్ ‍అయ్యేసరికి వసూళ్లు పెరిగే అవకాశముంది.

'సీన్' విషయానికొస్తే.. క్రైమ్ బ్రాంచ్‌లో డీఎస్పీగా పనిచేసే ప్రేమ్ రాజ్‌ (సూర్య) తన తెలివి తేటలతో క్లిష్టమైన కేసులను ఈజీగా సాల్వ్‌ చేస్తుంటాడు. సీరియల్ కిల్లర్ విక్టర్ (టోవినో థామస్)ను అరెస్ట్ చేసిన తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకుంటాడు. అది పెండింగ్‌లో ఉండగానే నగరంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. అవన్నీ సీరియల్‌ కిల్లర్‌ విక్టర్‌ చేసిన మర్డర్స్‌ మాదిరే ఉంటాయి. విక్టర్‌ జైల్లో ఉంటే బయట ఆ హత్యలు ఎవరు చేస్తున్నారనేది మిస్టరీగా మారుతుంది. అదే సమయంలో ప్రేమ్‌ సంబంధించిన ఓ సంచలన నిజం క్రైమ్‌ బ్రాంచ్‌ చీఫ్‌ స్టీఫెన్‌కి తెలుస్తుంది. దీంతో విక్టర్‌ని ఉద్యోగం నుంచి తప్పిస్తాడు.

అయినప్పటికీ సీరియల్‌ కిల్లర్‌ కేసుని ప్రేమ్‌ సవాల్‌గా తీసుకుంటాడు. మాయ(నజ్రీయా) సాయంతో ఈ కేసులను విచారిస్తుంటాడు. అసలు ఆ హత్యలు చేస్తున్నదెవరు? ప్రేమ్‌  ఆ సీరియల్‌ కిల్లర్‌ని ఎలా పట్టుకున్నాడు? పై అధికారుల దగ్గర ప్రేమ్‌ దాచిన నిజం ఏంటి? ప్రేమ్‌కు ఉన్న సమస్య ఏంటి? ఈ కేసు విచారణలో ప్రేమ్‌కి మాయ ఎలాంటి సహాయం చేసింది? ఈ కథలో ఈశ్వరన్‌ (నస్లేన్‌) పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

(ఇదీ చదవండి: సూర్య ‘సీన్‌’మూవీ రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement