ప్రస్తుతం రివార్డ్-రివేంజ్ టాస్క్.. బిగ్‌బాస్ హౌస్‌లో నడుస్తోంది. దేబ్జానీ కారణంగా కుటుంబాన్ని కలుసుకునే ఛాన్స్ కోల్పోయిన ముకేశ్.. వర్షిణి త్యాగంతో తిరిగి ఆ అవకాశం దక్కించుకున్నాడు. అలానే కొత్త కెప్టెన్‌గా వంశీ ఎన్నికయ్యాడు. ఇంతకీ 10వ సీజన్‌లో 61వ రోజైన శుక్రవారం(నవంబర్ 06) ఏం జరిగింది?
(ఇదీ చదవండి: మేం విడాకులు తీసుకుని 14 ఏళ్లు.. కానీ ఇప్పటికీ: రేణు దేశాయ్)
రివార్డ్, రివెంజ్ టాస్క్‌ల్లో గెలిచిన వంశీ, శ్వేత, త్రిగుణ్, దేబ్జానీ.. ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు. అలానే వచ్చేవారం తమ కుటుంబాలని కలుసుకునే అవకాశం దక్కించుకున్నారు. రివెంజ్‌కి గురవ్వని వాళ్ళు ఎలిమినేషన్ నుంచి సేవ్ అయితే ఫ్యామిలీలని కలుసుకోవచ్చని చెప్పిన బిగ్‌బాస్.. రామకృష్ణ, వర్షిణి, అమన్, ముకేశ్‌కి మరో ఛాన్స్ ఇస్తా అందులో ఎవరు గెలిస్తే.. వాళ్ళు తమ కుటుంబాన్ని కలుసుకోవచ్చని చెప్పాడు.
వీళ్ల నలుగురిని ఇద్దరిద్దరుగా గేమ్ ఆడమని చెప్పిన బిగ్‌బాస్.. గెలిచిన జంటలో ఒక్కరే ఫ్యామిలీని కలుసుకోగలరని క్లారిటీ ఇచ్చాడు. ఈ టాస్క్ లో వర్షిణి –ముకేశ్, అమన్ – నరేశ్ ఆడారు. ఇందులో వర్షిణి – ముకేశ్ గెలిచారు. వాళ్ళు సరిగ్గా ఆడలేదని అందరూ నరేశ్ సంచాలక్ కావడంతో అతడితో గొడవ పడ్డారు. మరోవైపు ఇద్దరిలో ఎవరో ఒకర్ని డిసైడ్ చేసుకోమనడంతో వర్షిణి త్యాగం చేసి ముకేశ్, అతడి కుటుంబాన్ని కలుసుకునే అవకాశం దక్కేలా చేసి ఏడ్చేసింది.
చివరకు కెప్టెన్ డీజే టాస్క్ ఇచ్చారు. కంటెండర్స్ నలుగురు ఉంటారు. మ్యూజిక్ ప్లే అవుతున్నంతసేపు మిగతా వాళ్ళు డాన్స్ చేయాలి. మ్యూజిక్ ఆగాక ఫస్ట్ ఎవరు గంటని అందుకుంటారో వాళ్ళు ఒక దండ తీసుకొని కెప్టెన్ ఎవరు కావాలనుకుంటున్నారో వాళ్ళ మెడలో దండ వేయాలి. కెప్టెన్సీ రేసులో త్రిగుణ్, వంశీ, శ్వేత, దేబ్జానీ ఉన్నారు. ఇంట్లో వాళ్ళకే కెప్టెన్ ఎంచుకునే ఛాన్స్ ఇచ్చారు. ఎక్కువ ఎవరికి దండలు పడతాయో వాళ్ళు కెప్టెన్ అవుతారు.
(ఇదీ చదవండి: ‘ఆదిపురుష్’ తప్పులు.. ‘రామాయణం’ నేర్చుకున్న పాఠాలు?)


