బిగ్‌బాస్ 10లోకి 'టెంపర్' విలన్
ఈసారి బిగ్‌బాస్‌లోకి టాలీవుడ్ విలన్ ఎంట్రీ ఇచ్చాడు. తన లుక్స్‌తోనే అందరినీ భయపెట్టే 'టెంపర్' వంశీ.. 9వ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టాడు. వంశీ అసలు పేరు వంశీ కృష్ణ కానీ తొలి సినిమా 'టెంపర్' నుంచి వంశీ అనే పేరుతోనే చాలా ఫేమస్ అయిపోయాడు. దీని తర్వాత లోఫర్, కాటమరాయుడు, పైసా వసూల్, భరత్ అను నేను, బ్లఫ్ మాస్టర్, డిస్కో రాజా, భీష్మ, వకీల్ సాబ్, పుష్ప పార్ట్-1, సర్కారు వారి పాట, హిట్ 2, టైగర్ నాగేశ్వరరావు, డబుల్ ఇస్మార్ట్, ఉస్తాద్ భగత్ సింగ్. ఇలా చాలా మూవీస్‌లో సహాయ పాత్రలు చేశాడు. ఇప్పటి వరకు 5పైగా సినిమాలు చేశాడు. చూడటానికి రఫ్ అండ్ టఫ్‌గా కనిపించే వంశీ ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టాడు. మరి సినిమాల్లో కనిపించే వంశీ.. ఆఫ్ స్క్రీన్‌లోనూ అలానే ఉంటాడా? లేదంటే తనలోని మరో కోణాన్ని చూపించి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటాడా అనేది చూడాలి?