మలయాళంలో బాలనటుడిగా కెరీర్ మొదలుపెట్టి సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న నస్లేన్.. 'ప్రేమలు' దెబ్బకు తెలుగులోనూ బోలెడంత ఫేమ్ తెచ్చుకున్నాడు. రీసెంట్ టైంలో అయితే 'లోక' లాంటి ఇండస్ట్రీ హిట్‌లో భాగమైన ఇతడు.. ఇప్పుడు కోట్లాది రూపాయల ఖరీదు చేసే కారు కొనుగోలు చేశాడు. ఇంతకీ ఈ కారు రేటు ఎంతంటే?
2019 నుంచి సినిమాలు చేస్తున్న నస్లేన్.. 2024లో 'ప్రేమలు'తో హీరోగా బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. దీని తర్వాత కూడా హీరోగా చేస్తున్న ఇతడు.. ప్రస్తుతానికైతే సూర్య 'సీన్' మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీంతో పాటు మరో మూడు మలయాళ చిత్రాలు కూడా చేస్తున్నాడు.
ఇవన్నీ పక్కనబెడితే కొన్నిరోజుల క్రితం 'ప్రేమలు 2' ప్రకటించారు. కానీ దాన్ని పట్టాలెక్కించలేదు. బదులుగా ఆ దర్శకుడు గిరీష్ ఏడీ.. 'బెత్లెహెమ్ కుడుంబ యూనిట్' తీసి మలయాళ ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాడు. సరిగ్గా ఈ టైంలో రూ.2 కోట్లకు పైగా విలువైన రేంజ్ రోవర్ స్పోర్ట్ ఆటోబయోగ్రఫీ మోడల్ కారుని నస్లేన్ కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారింది. 26 ఏళ్లకు ఖరీదైన కారుకి ఈ నటుడు యజమాని అయిపోయాడు.


