టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తన సతీమణికి స్పెషల్ విషెస్ తెలిపారు. ఆమె పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా తన ప్రేమను వ్యక్తం చేశారు. తన భార్య మౌనికకు బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు.
మంచు మనోజ్ తన ట్వీట్‌లో రాస్తూ..' నా ప్రాణమైన మౌనికకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను నమ్మకంతో లేని రోజుల్లో నువ్వు నన్ను నమ్మావు. నా అత్యంత కష్టకాలంలోనూ, నా పునరాగమనంలోని ప్రతి అడుగులోనూ నీ విశ్వాసమే నాకు బలాన్నిచ్చింది. ధైరవ్, దేవసేనకు మీరే నా ఇల్లు. మీ కలలను సాకారం చేసుకుంటూ ఉండండి. ఐ లవ్ యూ. హ్యాపీ బర్త్ డే మౌనిక అంటూ' పోస్ట్ చేశారు.
ఇక మంచు మనోజ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం డేవిడ్ రెడ్డి మూవీలో నటిస్తున్నారు. హనుమా రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ నటిస్తున్నారు. 1897, 1920ల మధ్య బ్రిటిష్ కాలం నాటి నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మారియా ర్యాబోషాప్కా హీరోయిన్‌గా కనిపించనున్నారు. సముద్రఖనితో పాటు పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
Happy birthday to my life line Mounika. You believed in me on the days I could not. Through my toughest time and every step of my comeback, your faith gave me strength. To Dhairav and DevaSena, you are home. Keep building your dreams. I love you. #HBDMounikaBhumaManchu https://t.co/2zwBrLijbQ
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 4, 2026


