దూసుకెళ్తోన్న దృశ్యం-3.. మూడు రోజుల్లోనే క్రేజీ మార్క్..! | Ajay Devgn Drishyam 3 box office Day 3 collections | Sakshi
Sakshi News home page

Drishyam 3 Movie: బాక్సాఫీస్ షేక్.. రెండు సినిమాల రికార్డ్స్ బ్రేక్..!

Oct 5 2026 9:05 AM | Updated on Oct 5 2026 9:22 AM

Ajay Devgn Drishyam 3 box office Day 3 collections

బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ నటించిన లేటేస్ట్ మూవీ దృశ్యం-3..ది కంక్లూజన్. ఈ సిరీస్‌ సినిమాలకు ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. గతంలో వచ్చిన రెండు పార్ట్స్‌ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచాయి. ఈనె 2న విడుదలైన దృశ్యం-3 సైతం బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. కేవలం మూడు రోజుల్లోనే భారతదేశ వ్యాప్తంగా రూ. 176.50 కోట్ల నెట్‌ వసూళ్లు రాబట్టింది. 
ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ. 272.80 గ్రాస్‌ వసూళ్లు సాధించింది.

ఈ మూవీ ఇండియాలోనే రూ. 211.80 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఇదే జోరు కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల మార్కును దాటేలా కనిపిస్తోంది. ప్రముఖ ట్రేడ్ వెబ్‌సైట్ శాక్‌నిల్క్ ప్రకారం ఈ మూవీ రూ. 61 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ గతంలో రిలీజైన దృశ్యం (రూ. 23.05 కోట్లు), దృశ్యం 2 (రూ. 64.14 కోట్లు) రికార్డులను అధిగమించింది. కాగా.. ఈ చిత్రానికి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో శ్రియా సరన్  టబు, ఇషితా దత్తా, ప్రకాష్ రాజ్, జైదీప్ అహ్లావత్, రజత్ కపూర్, సౌరభ్ శుక్లా, కమలేష్ సావంత్ కీలక పాత్రల్లో నటించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement