'కేజీఎఫ్' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఏకంగా నాలుగేళ్ల సమయం తీసుకుని హీరో యష్ చేసిన మూవీ 'టాక్సిక్'. చాన్నాళ్ల క్రితం రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్‌తో రొమాన్స్, వయలెన్స్ ఎక్కువగా ఉండబోతుందనే హింట్ ఇచ్చారు. ట్రైలర్, సాంగ్స్‌తో అదే హైప్ మెంటైన్ అయ్యేలా చూసుకున్నారు. తీరా థియేటర్లలో మూవీ రిలీజయ్యాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 100 మందిలో ఒకరిద్దరు తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చలేదని టాక్ గట్టిగా వినిపించింది. దీంతో యష్ సినిమా పరిస్థితి ఘోరాతి ఘోరంగా తయారైంది.
(ఇదీ చదవండి: నడుము గిల్లే సీన్ చేయనంది.. 'బేబి' చూసి షాకయ్యా)
గత బుధవారం(ఆగస్టు 26) ఈ సినిమాని పాన్ ఇండియా భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో రిలీజ్ చేశారు. వీటిలో ఎందులోనూ సరిపడా కలెక్షన్స్ సాధించలేకపోయింది. ఇక ముందే ప్లాన్ చేసుకున్నట్లు ఇంగ్లీష్ వెర్షన్ ఈ శుక్రవారం(సెప్టెంబరు 04) మన దేశంలోని ముంబై, బెంగళూరు, గుర్‌గ్రామ్, నోయిడా నగరాల్లో 11 షోలు వేశారు. ఇప్పటికే డిజాస్టర్ టాక్ వచ్చేయడంతో ఈ వెర్షన్‌ని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో 450 టికెట్స్ అమ్ముడుపోయి రూ.1.40 లక్షల వసూళ్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది.
అదే టైంలో ఈ శుక్రవారం దేశవ్యాప్తంగా 'టాక్సిక్' సినిమాకు రూ.1.50-1.60 కోట్ల మధ్య మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం తెలుగు షోలు 20 లోపే ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రాలోని చాలా నగరాల్లో ఇప్పటికే షోలు పూర్తిగా తీసేశారు. ఒకటి రెండు చోట్ల మాత్రమే ఇంకా ప్రదర్శితమవుతోంది. 'కేజీఎఫ్' లాంటి సక్సెస్ తర్వాత యష్ సినిమాకు ఇలా జరగడం అంటే ఘోర అవమానమనే చెప్పొచ్చు.
ప్రస్తుతానికైతే యష్ దృష్టంతా 'రామాయణ్' మీదే ఉంది. ఇందులో రావణుడిగా నటించడంతో పాటు నిర్మాణంలోనూ భాగమయ్యాడు. ఇది హిట్ అవ్వాల్సిన అవసరం ఇతడికే ఎంతైనా ఉంది. అలానే హీరోగా తర్వాత ఎలాంటి సినిమా? ఏ దర్శకుడితో చేస్తాడనేది పెద్ద ప్రశ్నగా మారిపోయింది.
(ఇదీ చదవండి: కృష్ణాష్టమి రోజున శుభవార్త.. బిగ్‌బాస్ జంటకు మరో కూతురు)


