బిగ్‌బాస్‌లో ఎగిరిపడ్డ కంటెస్టెంట్లు! ఆడపిల్లని కూడా చూడలేదు..! | Biggboss 10 Telugu Day 11 Episode Highlights | Sakshi
Sakshi News home page

Bigg Boss10: బిగ్‌బాస్‌లో ఫిజికల్ ఫైట్! దేబ్జానీ కన్నీళ్లు.. కొట్టుకునే దాకా!

Sep 17 2026 7:18 AM | Updated on Sep 17 2026 7:40 AM

Biggboss 10 Telugu Day 11 Episode Highlights

బిగ్‌బాస్‌10 హౌస్‌ కెప్టెన్సీ రేస్‌ మరింత రసవత్తరంగా మారింది. కెప్టెన్‌గా ఎవరు నిలుస్తారనే ఉత్కంఠ మధ్య బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లకు వరుసగా టాస్క్‌లు ఇచ్చారు. మొదటి లెవల్‌లో ‘యానిమల్ పార్క్‌’ టాస్క్‌ ఇవ్వగా.. రెండో లెవల్‌లో ఫిజికల్‌ ఛాలెంజ్‌ నిర్వహించారు. ఈ క్రమంలో కంటెస్టెంట్ల మధ్య పోటీ తీవ్రస్థాయికి చేరింది. ఒక దశలో రోహిత్‌, వంశీ మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. అసలు నిన్నటి ఎపిసోడ్‌లో  ఏం జరిగిందో ఓ లుక్కేద్దాం రండి!

యానిమల్ పార్క్‌.. 
మొదటి లెవల్‌లో భాగంగా ‘యానిమల్ పార్క్‌’ టాస్క్‌ను బిగ్‌బాస్‌ ఇచ్చారు. ఈ గేమ్‌లో నలుగురు కంటెస్టెంట్లు రెండు జంటలుగా విడిపోయి ఆడాల్సి ఉంటుంది. ప్రతి జంటలో ఒకరు కర్టెన్‌ వెనుకకు వెళ్లి.. అక్కడ ఇచ్చిన జంతువుల సీక్వెన్స్‌ ప్రకారం ఒక్కొక్క జంతువులా నటించాలి. మరో కంటెస్టెంట్‌ రోప్‌ సహాయంతో కర్టెన్‌ను లాగుతూ.. తన పార్ట్‌నర్‌ ఏ జంతువులా యాక్ట్‌ చేస్తున్నాడో గుర్తించాలి. సరైన సమాధానం చెబితే పక్కనే ఉన్న ఆయా జంతువుల బ్లాక్స్‌ను తీసుకుని.. తమ పార్ట్‌నర్‌ ఉన్న ఫ్రేమ్‌లో జంతువులను సరైన సీక్వెన్స్‌లో అమర్చాలి. అన్ని బ్లాక్స్‌ను సరైన క్రమంలో అమర్చిన తర్వాత ఫ్రేమ్‌ వెనుక ఉన్న హ్యాండిల్‌ను స్టార్ట్‌ పాయింట్‌ నుంచి ఎండ్‌ పాయింట్‌ వరకు తీసుకెళ్లాలి. చివర్లో ఉన్న కంటెండర్‌ బోర్డును ఎవరు ముందుగా తీసి చూపిస్తారో.. ఆ జంట విజేతగా నిలుస్తుంది. అయితే కంటెస్టెంట్లు జంతువుల బ్లాక్స్‌ను ఏ క్రమంలో అమర్చారనేది సరిగ్గా ఉందా? లేదా? అన్నది సంచాలకులు నిర్ణయిస్తారు. ఈ టాస్క్‌లో గెలిచిన ఇద్దరు కంటెస్టెంట్లు కెప్టెన్సీ రేసులో కొనసాగడంతో పాటు.. ఓడిపోయిన ఇద్దరిలో ఒకరిని కెప్టెన్సీ రేసు నుంచి తొలగించే అవకాశం కూడా పొందుతారు. ఈ టాస్క్‌లో సృష్టి, వంశీలను సంచాలకులుగా బిగ్‌బాస్‌ నియమించారు.

జాన్సీ–ముకేశ్‌ జోడీ విజయం
ఈ గేమ్‌లో జంటలుగా ఎవరు ఆడతారనే ప్రశ్న రావడంతో ముకేశ్‌–జాన్సీ ఒక జోడీగా, శాలిని–అమర్‌ మరో జోడీగా బరిలోకి దిగారు. టాస్క్‌లో మొదటి నుంచి ఇద్దరు జంటలు గట్టిగానే పోటీపడ్డారు. చివరికి ఝాన్సీ,ముకేశ్‌ జోడీ విజయం సాధించింది. దీంతో ఝాన్సీ, ముకేశ్‌ కెప్టెన్సీ రేసులో కంటెండర్లుగా నిలిచారు. అంతేకాదు.. ఓడిపోయిన జంటలో నుంచి ఒకరిని కెప్టెన్సీ రేసు నుంచి తొలగించే అవకాశం వారికి లభించింది. దీంతో వారు అమర్‌ను కెప్టెన్సీ రేసు నుంచి తొలగించారు. (ఇదీ చదవండి: తమన్నా థ్రిల్లర్‌ మూవీ.. ఆసక్తిగా ట్రైలర్‌)

రెండో లెవల్‌లో అసలు ఫిజికల్‌ వార్‌!
ఆ తర్వాత రెండో లెవల్‌ మొదలైంది. ఈ లెవల్‌లో ఎలాంటి పోరాటం ఉండాలనేది ప్రేక్షకులు తమ పవర్‌తో నిర్ణయించారు. మానసిక బలాన్ని పరీక్షించాలా? శారీరక దృఢత్వాన్ని పరీక్షించాలా? అనే ప్రశ్నకు ప్రేక్షకులు శారీరక సామర్థ్యాన్ని పరీక్షించే ఛాలెంజ్‌కు మొగ్గుచూపారు. దీంతో లెవల్‌-2లో ఫిజికల్‌ ఛాలెంజ్‌ ఉంటుందని బిగ్‌బాస్‌ ప్రకటించారు. ఈ టాస్క్‌కు ‘స్నాచ్‌ ఇట్‌.. టీమ్‌ ఇట్‌.. త్రో ఇట్‌’ అనే పేరు పెట్టారు. ఇందులో నలుగురు కంటెస్టెంట్లు రెండు జంటలుగా విడిపోయి పోటీపడాలి. సమయానుసారం బజర్‌ మోగినప్పుడు గార్డెన్‌ ఏరియాలోకి బ్యాగ్స్‌ పడుతుంటాయి. ఆ బ్యాగ్‌లను దక్కించుకునేందుకు రెండు జంటలు పోటీ పడాలి. ఎవరైతే బ్యాగ్‌ను దక్కించుకుంటారో.. అందులో ఉన్న బాల్స్‌తో ఫ్రేమ్‌లో ఏర్పాటు చేసిన డిస్క్‌లను కొట్టాలి. బజర్‌ పూర్తయ్యే సమయానికి ఎవరు ఎక్కువ డిస్క్‌లను పడగొడతారో వారే విజేతలుగా నిలుస్తారని బిగ్‌బాస్‌ వివరించారు. ఈ టాస్క్‌కు వంశీని సంచాలకుడిగా నియమించారు.

రోహిత్‌,దేబ్జానీ వర్సెస్‌ రాంప్రసాద్‌,త్రిగుణ్‌
రెండో లెవల్‌లో  దేబ్జానీ ,రోహిత్‌ ఒక జోడీగా, రాంప్రసాద్‌, త్రిగుణ్‌ మరో జోడీగా బరిలోకి దిగారు. గేమ్‌ మొదలైన వెంటనే ఫిజికల్‌ ఛాలెంజ్‌ కావడంతో కంటెస్టెంట్లు తమ పూర్తి శక్తిని ఉపయోగించారు. రాంప్రసాద్‌–త్రిగుణ్‌ జోడీ ఒక దశలో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మరోవైపు దేబ్జానీకి ఫిజికల్‌ టాస్క్‌ కావడంతో చాలా కష్టంగా మారింది. ఆమె పూర్తిస్థాయిలో రాణించలేకపోవడంతో రోహిత్‌ దాదాపు ఒంటరిగానే పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. గేమ్‌లో ఒత్తిడి పెరగడంతో ఒకానొక సమయంలో దేబ్జానీ భావోద్వేగానికి గురైంది. తాను ఆడలేకపోతున్నానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అయినప్పటికీ రోహిత్‌ తన జోడీని గెలిపించేందుకు చివరి వరకు పోరాడాడు. ఒకానోక సందర్భంలో త్రిగుణ్‌, రాంప్రసాద్‌లు ఆట తీవ్రస్థాయికి చేరుకోవడంతో గాల్లోకి ఎగిరిపడిపడ్డారు. అలాంటి సన్నివేశాల్లో హౌస్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఈ టాస్క్‌లో రాంప్రసాద్‌, తిగ్రణ్‌లు విజయం సాధించగా రోహిత్‌ కెప్టెన్సీ రేసు నుంచి తొలగించారు.
(ఇదీ చదవండి: రూ.200 కోట్ల సినిమా.. త్రివిక్రమ్ తప్పుకున్నారా?)
రోహిత్‌,వంశీ మధ్య భారీ గొడవ
ఇదే సమయంలో టాస్క్‌ నిర్వహణ విషయంలో రోహిత్‌, సంచాలకుడు వంశీ మధ్య వివాదం మొదలైంది. గేమ్‌లో జరిగిన అంశంపై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఒకరిపై ఒకరు తీవ్రంగా మాట్లాడుకోవడంతో పరిస్థితి అదుపు తప్పే స్థాయికి చేరుకుంది. మాటలు తీవ్రం కావడంతో ఇద్దరి మధ్య గొడవ మరింత ముదిరింది. ఒక దశలో ఇద్దరూ ఒకరిపై ఒకరు దూసుకెళ్లడంతో పరిస్థితి కొట్టుకునే స్థాయికి వెళ్లినట్లు కనిపించింది. ఇలా కెప్టెన్సీ రేసులో భాగంగా ఇచ్చిన రెండో లెవల్‌ టాస్క్‌ కేవలం గేమ్‌గా కాకుండా.. కంటెస్టెంట్ల మధ్య తీవ్ర వాగ్వాదానికి కారణమైంది. దేబ్జానీ కన్నీళ్లు పెట్టుకోవడం, రోహిత్‌ ఒంటరిగా పోరాడటం, చివర్లో రోహిత్‌, వంశీ మధ్య గొడవతో ఈ ఎపిసోడ్‌ మరింత ఆసక్తికరంగా మారింది.
(ఇదీ చదవండి: ఇరుముడి సక్సెస్‌.. చిన్నారి నక్షత్రకు బిగ్‌ సర్‌ప్రైజ్‌)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement