వేవేల ఊహలే చూపినా...  | Baa Baa Black Sheep release date fix | Sakshi
Sakshi News home page

వేవేల ఊహలే చూపినా... 

Sep 17 2026 4:29 AM | Updated on Sep 17 2026 4:29 AM

Baa Baa Black Sheep release date fix

టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్‌ మరియన్, అక్షయ్, విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళ్వీ మల్హోత్రా తదితరులు నటించిన చిత్రం ‘బా బా బ్లాక్‌ షీప్‌’. గుణి మంచికంటి దర్శకత్వంలో దోనేపూడి చక్రపాణి సమర్పణలో వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 9న రిలీజ్‌ కానుంది. ఎలక్ట్రానిక్‌ కిలి, ఆర్కాడో సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘వేవేల ఊహలే చూపినా..’ అంటూ సాగే సెకండ్‌ సాంగ్‌ను డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి విడుదల చేశారు. ఈ పాటను కిట్టు విస్సాప్రగడ రాయగా, శ్రీ సాగర్‌ పాడారు. వేణు దోనేపూడి మాట్లాడుతూ– ‘‘వేవేల ఊహలే చూపినా..’ అనే సాంగ్‌ డిఫరెంట్‌ స్టైల్లో సాగుతుంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ ఫైనల్‌ స్టేజ్‌లో ఉన్నాయి’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement