లాటరీ టికెట్ల విక్రేతకు రూ.12 కోట్ల జాక్‌పాట్‌  | Jackpot for Kerala Lottery Ticket Seller | Sakshi
Sakshi News home page

లాటరీ టికెట్ల విక్రేతకు రూ.12 కోట్ల జాక్‌పాట్‌ 

May 24 2026 4:28 AM | Updated on May 24 2026 4:28 AM

Jackpot for Kerala Lottery Ticket Seller

కొల్లాం(కేరళ): కేరళకు చెందిన ఓ లాటరీ టికెట్ల విక్రేత ఏకంగా రూ.12 కోట్ల జాక్‌పాట్‌ గెల్చుకున్నారు. శనివారం ప్రకటించిన విష్ణు బంపర్‌ లాటరీలో ఈయన తన కోసం ఉంచుకున్న టికెట్‌ కోట్లు కురిపించింది. కొల్లాంకు చెందిన పొన్నన్‌ రోడ్డు పక్కన లాటరీ టికెట్లను అమ్ముతుంటారు. ఆయన భార్య, కుమారుడు చేసేదీ ఇదే. ‘నా లక్కీ నంబర్‌ 2, నేను సొంతానికి ఉంచుకున్న టికెట్‌ చిట్టచివరి నంబర్‌ కూడా ఇదే‘అని పొన్నన్‌ అన్నారు. 

లాటరీ వచ్చిందని చెబితే తానస్సలు నమ్మలేకపోయానన్నారు. ‘ఒకటికి పదిసార్లు చూసుకున్నా..కచ్చితంగా అది నా దగ్గరున్న టికెట్‌కే వచ్చిందా అని, నేను నమ్మకలేకపోయా’అంటూ ఆయన ఉద్వేగంతో చెప్పారు. ‘పేదలకు పిల్లనిచ్చే వారే దొరకడం లేదు. ఇకనైనా నా కుమారుడిని తగిన వధువు దొరుకుతుందం’టూ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘మా ఆయన ఇప్పుడు కోటీశ్వరుడు. మాకున్న అప్పులన్నీ తీరుతాయి’అంటూ పొన్నన్‌ భార్య అంటోంది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement