breaking news
bumper lottery
-
లక్ లక్కలా అతుక్కుంది.. 25 కోట్ల లాటరీ!
లక్ అంటే అతడిదే. ఎంతో మందికి ఏళ్లకు ఏళ్లుగా ఎదురు చూస్తున్నా దక్కని అదృష్టం.. అతడిని మాత్రం వెంటనే వరించింది. ఫస్ట్ టైమ్ కొన్న లాటరీ టికెట్‌తోనే ఓవర్‌నైట్ కోటీశ్వరుడు అయిపోయాడు. ఒకటి రెండు కాదు ఏకంగా 25 కోట్ల రూపాయల బంఫర్ లాటరీ కొట్టాడు. 'నువ్వు చాలా లక్కీ బ్రో' అంటూ నెటిజనులు అతడికి విషెస్ చెబుతున్నారు. ఇంతకీ ఎవరతను?అలప్పుజ (కేరళ): అలప్పుజ జిల్లా తైకట్టుస్సేరీ నివాసి శరత్ నాయర్.. తిరువోణం బంపర్ లాటరీలో (Thiruvonam Bumper lottery) రూ.25 కోట్ల బహుమతిని గెలుచుకున్నారు. ఈ మేరకు నాయర్ సోమవారం తన లాటరీ టికెట్‌ను స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా తురవూర్ శాఖ కార్యాలయానికి అందజేశారు. ‘టీహెచ్ 577825’నంబరు గల ఈ టికెట్‌ను ఆయన ఏజెంట్ లతీష్కుకు చెందిన లాటరీ రిటైల్ అవుట్‌లెట్‌లో కొనుగోలు చేశారు. ‘అక్టోబర్ 3న ఫలితాలు ప్రకటించినప్పుడు ఆ విజేత టికెట్ నా దగ్గరే ఉందని నమ్మలేకపోయాను. తరువాత, ఇంటికి వెళ్లి టికెట్‌ను పరిశీలించి నిర్ధారించుకున్నాను’.. అని నాయర్ తెలిపారు.‘నేను బంపర్ టికెట్ కొనడం ఇదే మొదటిసారి. చిన్న లాటరీ టిక్కెట్లు ఎప్పుడో కానీ కొనను’.. అని శరత్ నాయర్ (Sarath Nair) స్పష్టం చేశారు. రూ.25 కోట్ల మొత్తంతో ఏం చేస్తారని ప్రశ్నించగా.. తానింకా ఏం నిర్ణయించుకోలేదన్నారు. తనకున్న అప్పులు తీర్చాక.. కుటుంబంతో కలిసి భవిష్యత్తు గురించి చర్చిస్తానని పేర్కొన్నారు. పెయింట్ షాప్‌లో ఇంకా పనిచేస్తారా? అని ప్రశ్నించగా.. 12 ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్నానని, అక్కడే కొనసాగుతానని సమాధానమిచ్చారు. కేరళ రాష్ట్ర లాటరీల విభాగం నిర్వహించే లాటరీలన్నిటిలోనూ.. అత్యధిక మొత్తం మొదటి బహుమతి తిరువోణం బంపర్దే కావడం విశేషం.చదవండి: దివాళా తీశాడని భార్య వదిలేసింది.. కట్ చేస్తే.. -
ఆటో డ్రైవర్‌కు రూ.25 కోట్ల లాటరీ
తిరువనంతపురం: కేరళలోని శ్రీవరాహం ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ అనూప్‌కు ఓనమ్ బంపర్ లాటరీలో రూ.25 కోట్ల జాక్‌పాట్ తగిలింది. మలేసియా వెళ్లి చెఫ్‌గా స్థిరపడాలనుకుని ఏర్పాట్లు చేసుకుంటున్న ఇతడు 22 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొని అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. అన్ని పన్నులు పోను అనూప్ చేతికి రూ.15 కోట్లు అందుతాయని నిర్వాహకులు చెప్పారు. ఈ డబ్బుతో అప్పులు తీర్చి, ఇల్లు కట్టుకుంటానని అనూప్ తెలిపాడు. -
ఒక్క స్క్రాచ్ కార్డు జీవితాన్ని మార్చేసింది
వర్జీనియా : తల్లితో కలిసి ఒక కొడుకు సరదాగా సరుకుల షాప్‌కు వెళ్లాడు. తల్లి సరుకులు కొనే పనిలో బిజీగా ఉండడంతో ఆ కొడుక్కి ఏం చేయాలో తోచలేదు. దీంతో అదే షాపులో ఒక స్క్రాచ్ కార్డును కొన్నాడు. ఈలోపు తల్లి షాపింగ్ ముగించుకొని వచ్చింది. ఇద్దరు కలిసి ఇంటికి వెళ్లారు. తర్వాత తన వెంట తెచ్చకున్న స్క్రాచ్ కార్డును గీకి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడు. స్క్రాచ్కార్డును గీకగానే అందులో ఉన్నది చూసి ఎగిరి గెంతేశాడు. దీంతో వెంటనే తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందంటూ కొడుకును అడిగింది.(పావురానికో గూడు.. భళా ప్రిన్స్!) మనకు లాటరీలో 1.4కోట్ల రూపాయలు వచ్చాయని కొడుకు చెప్పాడు. అయితే కొడుకు చెప్పింది ఆ తల్లి నమ్మలేదు.. స్క్రాచ్ కార్డును ఆమె చేతిలోకి తీసుకొని పరీక్షించింది. దాని మీద అక్షరాల 2,00,000 డాలర్లు గెలుచుకున్నట్లు ఉంది. అంతే ఆ తల్లి కొడుకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఘటన వర్జీనియాలో చోటుచేసుకుంది. లాటరీ గెలుచుకున్న వ్యక్తి పేరు హెబర్ట్ స్క్రగ్స్. షాపింగ్ చేసినంత టైంలోనే కోట్లు సంపాదించిన కొడుకును చూసి తల్లి మురిసిపోతుంటే... మిగతావారు మాత్రం వారికొచ్చిన బంపర్ లాటరీని చూసి ఈర్ష్య పడుతున్నారు. -
రాత్రికి రాత్రి కోటీశ్వరులయ్యారు!
తిరువనంతపురం: కేరళకు చెందిన ఆరుగురు సేల్స్మెన్లు రాత్రికిరాత్రి కోటీశ్వరులైపోయారు. కొల్లాం జిల్లాలోని ఓ నగల దుకాణంలో రాజీవన్, రామ్‌జిమ్, రోనీ, వివేక్, సుబిన్ థామస్, రతీష్‌లు కేరళ లాటరీ విభాగం విడుదలచేసిన టికెట్ కొన్నారు. తాజా లాటరీ ఫలితాల్లో వీరుకొన్న టికెట్‌కు మొదటి బహుమతి కింద ఏకంగా రూ.12 కోట్లు వచ్చాయి. ఇందులో పన్నులు, ఇతర కత్తింపులు పోనూ ఆరుగురు విజేతలకు రూ.7.56 కోట్లు దక్కనున్నాయి. ‘మేమంతా తలో కొంత డబ్బు వేసుకుని గతంలో లాటరీ టిక్కెట్లు కొన్నాం. ఈసారి కూడా అలాగే లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేశామ’ని వివేక్ తెలిపారు. ‘లాటరీలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు గెల్చుకోవడాన్ని మొదట నమ్మలేకపోయాం. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఈ డబ్బుతో ఏం చేయాలన్న దాని గురించి ఆలోచిస్తున్నామ’ని సుబిన్ థామస్ అన్నారు. తలో 50 రూపాయలు వేసుకుని 300 రూపాయల లాటరీ టిక్కెట్ కొన్నట్టు చెప్పారు. తమ దగ్గరున్న టిక్కెట్‌కే బంఫర్ డ్రా తగిలిందని తెలిపారు. రెండో ప్రైజ్ రూ. 5 కోట్లు(50 లక్షల చొప్పున 10 మందికి), మూడో ప్రైజ్ 2 కోట్లు (10 లక్షల చొప్పున 20మందికి), నాలుగో ప్రైజ్ రూ. కోటి రూపాయలు అని వెల్లడించారు. తిరువోనం బంఫర్గా పిలిచే ఈ లాటరీ కేరళలో చాలా పాపులర్. గురువారం లాటరీ తీసే సమయానికి 46 లక్షల టిక్కట్లగానూ దాదాపు 43 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. తిరువనంతపురంలోని గోర్కీ భవన్లో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు లాటరీ విజేతలను ప్రకటించారు. ఆరుగురు సేల్స్మెన్లు కొన్న టిమ్-160869 టిక్కెట్‌కు బంఫర్ లాటరీ తగిలింది. టిక్కెట్ అమ్మకాలపై విధించే పన్నుల ద్వారా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది. ఓనమ్, దసరా, కిస్మస్ పండుగల సందర్భంగా కేరళలో భారీగా లాటరీలు నిర్వహిస్తుంటారు. -
భారతీయ దర్జీకి బంపర్ లాటరీ
దుబాయ్: దర్జీగా పనిచేస్తున్న ఓ ప్రవాస భారతీయుడు(33) దుబాయ్ షాపింగ్ మహోత్సవంలో బంపర్ లాటరీ గెలుచుకున్నాడు. మూడు రోజుల క్రితమే జన్మించిన కుమారుడు అతడికి అదృష్టాన్ని మోసుకొచ్చాడు. కేరళకు చెందిన ఫసలుద్దీన్ కుట్టిపాలక్కాల్ దుబాయ్‌లో దర్జీగా పనిచేస్తున్నాడు. దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ 2014 సందర్భంగా నిర్వహించిన ఇన్ఫినిటీ మెగా లాటరీలో ఆయన లక్ష దిర్హామ్‌లు(రూ.16.9 లక్షలు), రెండు విలాసవంతమైన కార్లు దక్కించుకున్నాడు. లాటరీలో పదేళ్లుగా తన అదష్టాన్ని పరీక్షించుకుంటున్న ఫసలుద్దీన్కు కొడుకు పుట్టిన వెంటనే భారీ మొత్తం దక్కటంతో ఆనందానికి అవధుల్లేవు. ఏటా స్నేహితులతో కలిసి లాటరీ టిక్కెట్ కొనుగోలు చేసే ఫసలుద్దీన్ ఈసారి మాత్రం ఒంటరిగానే వెళ్లి కొత్తేడాదిలో అదష్టాన్ని మూటగట్టుకున్నాడు. ఈ ఏడాది లాటరీ తననే వరిస్తుందని గట్టిగా విశ్వసించినట్లు చెప్పాడు. ఒక వంతు సొమ్మును స్నేహితుల అవసరాలు, కుటుంబసభ్యుల కోసం వెచ్చించి మిగతా డబ్బుతో కేరళలో ఇల్లు నిర్మించుకుంటానని తెలిపాడు. ఖరీదైన కార్లను ఏం చేయాలో ఫసల్ ఇంకా ఆలోచించలేదు.