పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో.. డాక్టర్‌తో నిశ్చితార్థం | Actor Niranjan Sudhindra Engagement With Sanjana | Sakshi
Sakshi News home page

Niranjan Sudhindra: హీరో ఉపేంద్ర ఇంట్లో శుభకార్యం.. ఫొటోలు వైరల్

May 26 2026 9:01 AM | Updated on May 26 2026 9:07 AM

Actor Niranjan Sudhindra Engagement With Sanjana

ఉపేంద్ర కన్నడ ఇండస్ట్రీకి చెందినవాడే అయినప్పటికీ తెలుగులోనూ బోలెడంతమంది ఫ్యాన్స్ ఉన్నాడు. గతంలో ఈయన చేసిన చిత్రాలు కల్ట్ స్టేటస్ దక్కించుకున్నాయి. ప్రస్తుతం హీరోగా, సహాయ పాత్రలు చేస్తూ బిజీగా ఉన్న ఈయన ఇంట్లో శుభకార్యం జరిగింది. ఈయన అన్న కొడుకు, హీరో నిరంజన్ నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్

ఉపేంద్ర అన్న కొడుకు అయిన నిరంజన్ సుధీంద్ర.. 2018లో వచ్చిన 'సెకండాఫ్' మూవీతో నటుడిగా పరిచయమయ్యాడు. 2022లో రిలీజైన 'నమ్మ హుడుగురు' మూవీలోనూ నటించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజైన 'సీతా పయనం'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. దీనికి ప్రముఖ నటుడు అర్జున్ సర్జా దర్శకత్వం వహించగా ఇతడి కూతురు ఐశ్వర్య హీరోయిన్‌గా చేసింది. భాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ పెద్దగా వర్కౌట్ కాలేదు.

నటుడు నిరంజన్ సుధీంద్ర.. డాక్టర్ సంజనా రాజ్‌ని ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ఈ వేడుకకు కుటుంబ సమేతంగా హాజరైన ఉపేంద్ర.. కాబోయే వధూవరులని మనసారా దీవించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలని ఉపేంద్ర సతీమణి తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకుంది.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకోవడం కంటే కుక్కని పెంచుకోవడం చాలా బెటర్: టాలీవుడ్ హీరోయిన్)

Advertisement
 
Advertisement
Advertisement