పెళ్లి కంటే ఆ పని చేయడం వందరెట్లు బెటర్: టాలీవుడ్ హీరోయిన్ | Tollywood Actress Swathi Reddy Comments About Marriage Life, Says Marriage Is Hard And Raising A Dog Is Better | Sakshi
Sakshi News home page

Swathi Reddy: 'పెళ్లి కంటే ఆ పని చేయడం చాలా బెటర్'

May 25 2026 4:03 PM | Updated on May 25 2026 5:17 PM

tollywood actress Swathi Reddy about marriage life

స్వాతి అంటే గుర్తు పట్టరేమో కానీ.. కలర్స్ యాడ్ చేస్తే ఇట్టే పసిగడతారు. అంతలా ఆ పేరుతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో పేరు సంపాదించుకుంది. డేంజర్‌ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన తెలుగమ్మాయి.. ఆడవారికి మాటలకు అర్థాలే వేరులే సినిమాతో ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత అష్టా చెమ్మా, త్రిపుర, కలవరమాయే మదిలో, మిరపకాయ్ చిత్రాల్లో నటించింది. కొన్నేళ్ల తర్వాత మంత్ ఆఫ్ మధు చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించింది.

ప్రస్తుతం సినిమాలేవీ చేయకపోయినా ఈ ముద్దుగుమ్మ.. తాజా ఇంటర్వ్యూలో పెళ్లి, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడింది. ముఖ్యంగా పెళ్లి టాపిక్‌పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకోవడం కన్నా ఓ కుక్కను పెంచుకోవడం చాలా బెటర్ అని తన మనసులోని మాటను బయటకు చెప్పేశారు. ఈ రోజుల్లో ఒక మనిషిని నమ్మి, వివాహం చేసుకుని జీవితాంతం కలిసి ఉండటం చాలా కష్టంగా మారిపోయిందని తెలిపింది.

ఈ రోజుల్లో ఎవరికీ కూడా కొంచే కూడా ఓపిక ఉండడం లేదని.. అందుకే ముక్కు, మొహం తెలియని వ్యక్తిని పెళ్లాడి ప్రతిరోజూ మానసిక ప్రశాంతతను కోల్పోవడం నాకు ఇష్టం లేదన్నారు. అందుకే ఎలా చింతా లేకుండా హాయిగా ఒక కుక్కను పెంచుకోవడం చాలా బెటర్ అని  అన్నారు. ఎందుకంటే అది మనకు ఎప్పుడూ నమ్మకంగా ఉంటుందని.. ఎలాంటి కండిషన్లు లేకుండా మనల్ని ప్రేమిస్తుందని హీరోయిన్ స్వాతిరెడ్డి చెప్పుకొచ్చింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement