breaking news
Baa Baa Black Sheep Movie
-
వేవేల ఊహలే చూపినా...
టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్, విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళ్వీ మల్హోత్రా తదితరులు నటించిన చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’. గుణి మంచికంటి దర్శకత్వంలో దోనేపూడి చక్రపాణి సమర్పణలో వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 9న రిలీజ్ కానుంది. ఎలక్ట్రానిక్ కిలి, ఆర్కాడో సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘వేవేల ఊహలే చూపినా..’ అంటూ సాగే సెకండ్ సాంగ్‌ను డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ పాటను కిట్టు విస్సాప్రగడ రాయగా, శ్రీ సాగర్ పాడారు. వేణు దోనేపూడి మాట్లాడుతూ– ‘‘వేవేల ఊహలే చూపినా..’ అనే సాంగ్ డిఫరెంట్ స్టైల్లో సాగుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫైనల్ స్టేజ్‌లో ఉన్నాయి’’ అన్నారు. -
మేరీ జానీ బాగుంది – దేవిశ్రీ ప్రసాద్
టిను ఆనంద్, అక్షయ్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, విష్ణు ఓ.ఐ ప్రధాన పాత్రల్లో నటించిన న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ సినిమా ‘బా బా బ్లాక్‌షీప్’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో గుణి మంచికంటి దర్శకత్వంలో చిత్రాలయం స్టూడియో పతాకంపై వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబరు 9న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలోని ‘ఆజా మేరీ జానీ పాట లిరికల్ వీడియోను ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ విడుదల చేసి, యూత్‌కి కనెక్ట్ అయ్యేలా ఈ సాంగ్ బాగుందని, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. ఎలక్ట్రానిక్ కిలి – ఆనంద్ ద్వయం సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాటకు కిట్టు విస్సా ప్రగడ లిరిక్స్ రాయగా, బెన్నీ దయాల్ పాడారు. వేణు దోనేపూడి మాట్లాడుతూ – ‘‘ఆజా మేరీ..’ ఒక పార్టీ సాంగ్. అక్షయ్ – విష్ణు ఓయ్ ఈ పాటలో కనిపిస్తారు. పూర్తిగా మేఘాలయా రాష్ట్రంలో చిత్రీకరణను జరుపుకున్న తొలి దక్షిణాది సినిమా మాదే. అనుకోకుండా జరిగే ఓ ఘటన కొన్ని సందర్భాల్లో మనతో పాటు మన చుట్టూ ఉన్న వారి జీవితాల్లోనూ ఊహించని పరిణామాలు చోటు చేసుకోవటానికి కారణమవుతాయి. ఇలాంటి కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది’’ అని తెలిపారు. -
'బాక్స్ కోసం వేట'.. ఫుల్ కామెడీగా బాబా బ్లాక్‌షీప్ టీజర్
టిను ఆనంద్, ఉపేంద్ర లిమాయే, జార్జ్ మరియన్ ప్రధాన పాత్రలో వస్తోన్న ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ బాబా బ్లాక్ షీప్.. ఈ సినిమాకు గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని దోనెపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియో బ్యానర్‌పై వేణు దోనెపూడి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. హీరో శర్వానంద్ చేతుల మీదుగా టీజర్‌ను విడుదల చేశారు.తాజాగా రిలీజైన టీజర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా అంతా ఓ బాక్స్ చుట్టే తిరుగుతున్నట్లు టీజర్లో అర్థమవుతోంది. గన్స్, గోల్డ్ చుట్టూ జరిగే ఓ న్యూ ఏజ్ క్రైమ్ కామెడీగానే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. టీజర్లో ఉపేంద్ర కామెడీ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ చిత్రంలో అక్షయ్ లగుసాని , విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళవి, కశ్యప్, కార్తికేయ దేవ్, సమ్రీధీ ఆర్యల్, మాల్వీ మల్హోత్రా, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో నటించారు. -
ఒక రోజులో జరిగే కథే ‘బా బా బ్లాక్ షీప్’
టిన్ను ఆనంద్, ఉపేంద్ర లిమయే, జార్జ్ మరియన్, రాజా రవీంద్ర, అక్షయ్ లఘుసాని, మాల్వి మల్హోత్రా ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’. గుణి మంచికంటిని దర్శకునిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మేఘాలయలో జరుగుతోంది. వేణు దోనేపూడి మాట్లాడుతూ– ‘‘ఒక రోజులో జరిగే కథతో తెరకెక్కుతోన్న చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’. ఆరుగురి మధ్య సాగే ఆసక్తికరమైన కథ ఇది. గన్స్, గోల్డ్, హంట్ అంటూ ఆసక్తికరంగా ఉంటుంది. ‘బా బా బ్లాక్ షీప్’ కోసం మేఘాలయ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాం. ఇటీవల మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ కె. సంగ్మాగారిని కలిశాం. మేఘాలయలో షూటింగ్ కోసం తమ వంతు సంపూర్ణ సహకారాన్ని అందిస్తామన్నారు సీఎం. మేఘాలయలో పూర్తి స్థాయిలో షూటింగ్ చేసుకుంటున్న తొలి చిత్రం మాదే. ఈ చిత్రకథ మొత్తం నార్త్, ఈస్ట్ ఇండియాలో సాగుతుంది కాబట్టి ఇక్కడే చిత్రీకరిస్తున్నాం. జల΄ాతాలు, కొండలు, అందమైన ప్రదేశాల్లో సాగే కథ ఇది’’ అని చెప్పారు.


