'బాక్స్ కోసం వేట'.. ఫుల్ కామెడీగా బాబా బ్లాక్‌షీప్ టీజర్ | Tollywood Movie Baa Baa Black Sheep Official TEASER Out now | Sakshi
Sakshi News home page

Baa Baa Black Sheep Official TEASER: ఆ బాక్స్‌లో ఏముంది?.. నవ్వులు తెప్పిస్తోన్న టీజర్

Jan 23 2026 7:08 PM | Updated on Jan 23 2026 7:25 PM

Tollywood Movie Baa Baa Black Sheep Official TEASER Out now

టిను ఆనంద్, ఉపేంద్ర లిమాయే, జార్జ్ మరియన్ ప్రధాన పాత్రలో వస్తోన్న ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ బాబా బ్లాక్ షీప్.. ఈ సినిమాకు గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని  దోనెపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియో బ్యానర్‌పై వేణు దోనెపూడి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. హీరో శర్వానంద్ చేతుల మీదుగా టీజర్‌ను విడుదల చేశారు.

తాజాగా రిలీజైన టీజర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా అంతా ఓ బాక్స్‌ చుట్టే తిరుగుతున్నట్లు టీజర్‌లో అర్థమవుతోంది.  గన్స్, గోల్డ్ చుట్టూ జరిగే ఓ న్యూ ఏజ్ క్రైమ్ కామెడీగానే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. టీజర్‌లో ఉపేంద్ర కామెడీ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.  కాగా.. ఈ చిత్రంలో అక్షయ్ లగుసాని , విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళవి, కశ్యప్, కార్తికేయ దేవ్, సమ్రీధీ ఆర్యల్, మాల్వీ మల్హోత్రా, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో నటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement