టిన్ను ఆనంద్, ఉపేంద్ర లిమయే, జార్జ్ మరియన్, రాజా రవీంద్ర, అక్షయ్ లఘుసాని, మాల్వి మల్హోత్రా ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’. గుణి మంచికంటిని దర్శకునిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మేఘాలయలో జరుగుతోంది.
వేణు దోనేపూడి మాట్లాడుతూ– ‘‘ఒక రోజులో జరిగే కథతో తెరకెక్కుతోన్న చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’. ఆరుగురి మధ్య సాగే ఆసక్తికరమైన కథ ఇది. గన్స్, గోల్డ్, హంట్ అంటూ ఆసక్తికరంగా ఉంటుంది. ‘బా బా బ్లాక్ షీప్’ కోసం మేఘాలయ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాం. ఇటీవల మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ కె. సంగ్మాగారిని కలిశాం.
మేఘాలయలో షూటింగ్ కోసం తమ వంతు సంపూర్ణ సహకారాన్ని అందిస్తామన్నారు సీఎం. మేఘాలయలో పూర్తి స్థాయిలో షూటింగ్ చేసుకుంటున్న తొలి చిత్రం మాదే. ఈ చిత్రకథ మొత్తం నార్త్, ఈస్ట్ ఇండియాలో సాగుతుంది కాబట్టి ఇక్కడే చిత్రీకరిస్తున్నాం. జల΄ాతాలు, కొండలు, అందమైన ప్రదేశాల్లో సాగే కథ ఇది’’ అని చెప్పారు.


