'దండోరా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు శివాజీ మాట్లాడుతూ.. హీరోయిన్లు కొంచెం డ్రెస్ సెన్స్ పాటించాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రామ్‌చరణ్ పెద్ద సినిమాను కూడా తాకుతున్నాయి. ఇంతకీ శివాజీ ఏమన్నాడంటే.. 'హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకునిపోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తుందంటూ.. మీ అందం చీరలోనూ, నిండుగా కట్టుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే ‘సామాను’ కనబడే వాటిలో ఏమీ ఉండదమ్మా అని సూక్తులు చెప్పాడు. అయితే, సామాజిక కార్యకర్తలతో పాటు సినీ రంగం నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో తనతప్పు తెలుసుకుని సారీ చెప్పాడు.
అయితే, శివాజీ చేసిన డర్టీ సామాను వ్యాఖ్యలు అటు తిరిగి ఇటు తిరిగి పెద్ది సినిమాపై పడ్డాయి. రీసెంట్‌గా భారీ హిట్ అయిన చికిరి పాట తెరపైకి వచ్చింది. ఈ సాంగ్‌లో కూడా 'సరుకు సామాను' అనే పదాలను రచయిత వాడారు. పనిలో పనిగా ఇందులో ఉన్న మరికొన్ని ఇలాంటి పదాలే బయటకు తవ్వారు. ఈ పాటలో ఒకచోట 'ఆ చంద్రుల్లో ముక్క.. జారిందే 'దీనక్క'.. నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా' అంటూ రాసుకుంటూ పోయాడు. సరుకు సామాను అనే పదాన్ని వాడుకలో ఉపయోగిస్తాం కదా అని కొందరు పక్కన పెడితే.. దీనక్క అనేది అభ్యంతరంగానే ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీంతో శివాజీతో పాటు పెద్ది సాంగ్ రచయితను కూడా ఏకిపారేస్తున్నారు.
రవితేజ నటించిన మాస్ జాతరలో కూడా ఇలాంటి పదాలే కనిపించాయి. శ్రీలీలతో 'ఓలే ఓలే' సాంగ్ కోసం స్టెప్పులేసిన రవితేజ కూడా ఆ పాటకు అభ్యంతరం చెప్పలేదు. చెప్పలేని పదాలతో ఎక్కడపడితే అక్కడ బూతులతో రెచ్చిపోయారు. ఓ ఇంటర్వ్యూలో కూడా మేకర్స్ ఆ పాటను సమర్థించుకోవడం మరింత నీచం. శివాజీ వ్యాఖ్యల తర్వాత ఇలాంటి డర్జీ చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇలాంటి సాంగ్స్, డైలాగ్స్ వచ్చినప్పుడు శివాజీ అడ్డుచెప్పలేదు ఎందుకు.. అతని వ్యాఖ్యలను సమర్థించే వారు ఈ డర్టీ సంప్రదాయాన్ని కూడా మెచ్చుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు.
“సరుకు సామాను”………
ఈ సాంగ్‌లో వాడారు కదా, అప్పుడు కూడా అందరూ రియాక్ట్ అయ్యారా?
జస్ట్ అనిపించింది… ఎవరు అయినా రియాక్ట్ అయితే మంచిదే……#justasking pic.twitter.com/dQJJu6pcvF— 9iMedia (@9iMediaNews) December 23, 2025


