బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్. పెద్దగా బజ్ లేకుండానే వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను శాసిస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలై ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. తాజాగా మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది.
ఈ సినిమా విడుదలైన 21 రోజుల్లోనే రూ.1000 కోట్ల మార్క్ దాటేసింది. క్రిస్‌మస్ రోజున రూ. 26 కోట్లతో కలెక్షన్స్ పరంగా అదరగొట్టింది. దేశవ్యాప్తంగా రూ. 668.80 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రూ. 1006.7 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఏ రేటింగ్ చిత్రంగా ఘనత సాధించింది. అంతకుముందు ఈ రికార్డ్ రణబీర్ కపూర్ యానిమల్ పేరిట ఉంది.
కాగా.. ఈ సినిమాకు ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. పాకిస్తాన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కించారు. ధురంధర్‌లో సంజయ్ దత్, ఆర్ మాధవన్, రాకేష్ బేడి, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. వచ్చే ఏడాది మార్చి 19న దురంధర్ పార్ట్-2 విడుదల కానుంది.
Entering the 1000 CR club, loud and proud.
Book your tickets. (Link in bio)
🔗 - https://t.co/cXj3M5DFbc#Dhurandhar Frenzy Continues Worldwide.@RanveerOfficial #AkshayeKhanna @duttsanjay @ActorMadhavan @rampalarjun #SaraArjun @bolbedibol @AdityaDharFilms #JyotiDeshpande… pic.twitter.com/wAk2IklWT5— Jio Studios (@jiostudios) December 26, 2025


