బాక్సాఫీస్‌ రిపోర్టు బయటపెట్టడం అవసరమా?: హీరో | Nivin Pauly Angry on Malayalam Box Office Report 2025 | Sakshi
Sakshi News home page

185 సినిమాల్లో 15 మాత్రమే సక్సెస్‌.. బాక్సాఫీస్‌ రిపోర్టుపై హీరో ఆగ్రహం

Dec 26 2025 12:19 PM | Updated on Dec 26 2025 12:39 PM

Nivin Pauly Angry on Malayalam Box Office Report 2025

కేరళ చిత్ర నిర్మాతల మండలి ఇటీవలే మలయాళ సినిమా 2025 బాక్సాఫీస్‌ రిపోర్టును విడుదల చేసింది. ఈ ఏడాది ఇప్పటివరకు 184 చిత్రాలు రిలీజైతే వాటిలో కేవలం 15 మాత్రమే హిట్టయ్యాయని తెలిపింది. లోక, ఎల్‌2: ఎంపురాన్‌, తుడరుమ్‌, కలంకావల్‌, డియస్‌ ఈరే, హృదయపూర్వం, అలప్పుజ జింఖానా, రేఖాచిత్రం, ఆఫీసర్‌ ఆన్‌ డ్యూటీ సినిమాలను సూపర్‌హిట్‌గా అభివర్ణించారు. 

అవి మాత్రమే హిట్‌
ఎకో, పెట్‌ డిటెక్టివ్‌, ప్రిన్స్‌ అండ్‌ ఫ్యామిలీ, పోన్‌మాన్‌, పడక్కాలం, బ్రొమాన్స్‌ సినిమాలను హిట్లుగా పేర్కొన్నారు. 2024లో 10.633% సక్సెస్‌ రేషియో ఉంటే ఈసారి అది 8.15%కే పరిమితమైందని వెల్లడించారు. అయితే ఈ నివేదికపై పలువురు దర్శకనిర్మాతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సుమతి వలవు, నరివెట్ట వంటి సినిమాలు ఈ జాబితాలో ఎందుకు లేవని నిలదీస్తున్నారు. 

అవెందుకు లేవు?
నరివెట్ట దర్శకుడు అనురాజ్‌ మనోహర్‌ మాట్లాడుతూ.. మా సినిమా విజయం సాధించింది.. కానీ దాన్ని ఎందుకు లిస్టులో చేర్చలేదు? ఏ ప్రాతిపదికన ఈ జాబితా తయారు చేశారు? అని మండిపడ్డాడు. తాజాగా హీరో నివీన్‌ పౌలీ సైతం ఈ రిపోర్టుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈయన హీరోగా నటించిన సర్వం మాయ సినిమా డిసెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి పాజిటివ్‌ టాక్‌ వస్తోంది. 

అవసరమా?
ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ భేటీకి హాజరయ్యాడు నివిన్‌. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి బిజినెస్‌లో ఒడిదుడుకులు సహజం. లాభనష్టాలు వస్తుంటాయి. అంతమాత్రానికి (Kerala Film Producer Association) ఇలా బాక్సాఫీస్‌ రిపోర్టును బయటపెట్టాల్సిన అవసరం ఏముంది? దీనివల్ల సినిమాను నమ్ముకునేవాళ్లను నిరాశపర్చినట్లు అవుతుంది. గతంలో ఈ ధోరణి లేదు అని అసహనం వ్యక్తం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement