breaking news
box office performance
-
బాక్సాఫీస్ రిపోర్టు బయటపెట్టడం అవసరమా?: హీరో
కేరళ చిత్ర నిర్మాతల మండలి ఇటీవలే మలయాళ సినిమా 2025 బాక్సాఫీస్ రిపోర్టును విడుదల చేసింది. ఈ ఏడాది ఇప్పటివరకు 184 చిత్రాలు రిలీజైతే వాటిలో కేవలం 15 మాత్రమే హిట్టయ్యాయని తెలిపింది. లోక, ఎల్2: ఎంపురాన్, తుడరుమ్, కలంకావల్, డియస్ ఈరే, హృదయపూర్వం, అలప్పుజ జింఖానా, రేఖాచిత్రం, ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమాలను సూపర్‌హిట్‌గా అభివర్ణించారు. అవి మాత్రమే హిట్ఎకో, పెట్ డిటెక్టివ్, ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ, పోన్మాన్, పడక్కాలం, బ్రొమాన్స్ సినిమాలను హిట్లుగా పేర్కొన్నారు. 2024లో 10.633% సక్సెస్ రేషియో ఉంటే ఈసారి అది 8.15%కే పరిమితమైందని వెల్లడించారు. అయితే ఈ నివేదికపై పలువురు దర్శకనిర్మాతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సుమతి వలవు, నరివెట్ట వంటి సినిమాలు ఈ జాబితాలో ఎందుకు లేవని నిలదీస్తున్నారు. అవెందుకు లేవు?నరివెట్ట దర్శకుడు అనురాజ్ మనోహర్ మాట్లాడుతూ.. మా సినిమా విజయం సాధించింది.. కానీ దాన్ని ఎందుకు లిస్టులో చేర్చలేదు? ఏ ప్రాతిపదికన ఈ జాబితా తయారు చేశారు? అని మండిపడ్డాడు. తాజాగా హీరో నివీన్ పౌలీ సైతం ఈ రిపోర్టుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈయన హీరోగా నటించిన సర్వం మాయ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. అవసరమా?ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ భేటీకి హాజరయ్యాడు నివిన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి బిజినెస్‌లో ఒడిదుడుకులు సహజం. లాభనష్టాలు వస్తుంటాయి. అంతమాత్రానికి (Kerala Film Producer Association) ఇలా బాక్సాఫీస్ రిపోర్టును బయటపెట్టాల్సిన అవసరం ఏముంది? దీనివల్ల సినిమాను నమ్ముకునేవాళ్లను నిరాశపర్చినట్లు అవుతుంది. గతంలో ఈ ధోరణి లేదు అని అసహనం వ్యక్తం చేశాడు. -
'నా సినిమా.. పెద్దగా ఆడలేదు'
షారుక్ ఖాన్, కాజోల్ కలిసి నటించారంటే బాక్సాఫీసు మళ్లీ బద్దలవుతుందని అంతా ఆశించారు. కానీ 'దిల్వాలే' సినిమా మాత్రం అంత సీన్ లేదని నిరూపించింది. ఈ విషయాన్ని స్వయంగా బాలీవుడ్ బాద్షా షారుక్ కూడా అంగీకరించాడు. తన సినిమా ఆడాల్సినంతగా ఆడలేదని చెప్పాడు. ఇది తనకు చాలా నిరాశ కలిగించిందని చెప్పాడు. భారతదేశంలో దానికి రావల్సినంత కలెక్షన్లు రాలేదని, అయితే ఓవర్సీస్లో మాత్రం బాగుందని అన్నాడు. జర్మనీ, ఆస్ట్రియా లాంటి దేశాల్లో అది బాగా నడిచిందన్నాడు. భారతదేశంలో ఇప్పటివరకు దిల్వాలే సినిమాకు కేవలం రూ. 145 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ సినిమాను షారుక్ ఖాన్‌కు చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, రోహిత్ శెట్టి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. సరిగ్గా క్రిస్మస్ సెలవుల సమయంలో.. డిసెంబర్ 18న విడుదల చేసినా, ఇదిమాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.


