‘ఇరుముడి’ విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కూడా సినిమా దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడీ ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులనూ అలరించేందుకు సిద్ధమైంది.
శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నక్షత్ర (మణమ్మ) కీలక పాత్రలో నటించింది. చిన్న వయసులోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా తండ్రీకూతురు సెంటిమెంట్ సన్నివేశాల్లో నక్షత్ర నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఈ సన్నివేశాలను చూసి చాలామంది ప్రేక్షకులు భావోద్వేగానికి గురయ్యారు. (ఇదీ చదవండి: ‘ఇరుముడి’కి ఈ పాప రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..!)
నక్షత్రతో కేక్ కట్ చేయించి..
తాజాగా నక్షత్ర చదువుతున్న పాఠశాల యాజమాన్యం ఆమె విజయాన్ని ప్రత్యేకంగా అభినందించింది. స్కూల్‌లో నక్షత్రతో కేక్ కట్ చేయించి ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు ఆమెను అభినందించారు. చిన్నారి నక్షత్రను అందరూ ప్రశంసిస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా విజయంతో పాటు నక్షత్ర నటనకు ఇంతటి గుర్తింపు రావడంపై నెటిజన్లు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: ది ప్యారడైజ్ క్రేజ్.. ఈసారి ఏకంగా వినాయకుడే..
Nakshatra Celebrated the success of #Irumudi with her teachers and friends l! 🥹✨#RaviTeja #BlockbusterIrumudi pic.twitter.com/lrCyYv01IB
— Neeraj Kumar (@73forever_) September 15, 2026


