ఆ ఒక్క సినిమా నా కెరీర్‌నే మార్చేసింది : సూరి | Mandaadi Hero Soori Says This Film Change My Career | Sakshi
Sakshi News home page

ఆ ఒక్క సినిమా నా కెరీర్‌నే మార్చేసింది : సూరి

Sep 15 2026 6:19 PM | Updated on Sep 15 2026 6:44 PM

Mandaadi Hero Soori Says This Film Change My Career

ఒక్క సినిమా చాలు.. ఓ నటుడి కెరీర్‌నే మార్చేయడానికి. మంచి బొమ్మ పడాలే కానీ.. అప్పటివరకు ఉన్న ఇమేజ్‌ను పక్కనపెట్టి రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోవచ్చు. అందుకు తమిళ నటుడు సూరి ప్రయాణమే ఓ చక్కటి ఉదాహరణ. కమెడియన్‌గా ఎన్నో సినిమాల్లో నవ్వులు పూయించిన సూరి.. ‘విడుదలై’తో ఒక్కసారిగా తనలోని సీరియస్ నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఆ తర్వాత ‘గరుడన్’, ‘కొట్టుక్కాళి’, ‘మామన్’ వంటి చిత్రాలతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 

తాజాగా ‘మండాడి’తోనూ మరోసారి తన సత్తా చాటుతున్నాడు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల 10న రిలీజై బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతోంది. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ. 65 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సూరి..తన కెరీర్‌ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు.

నేను కమెడియన్‌గా చాలా సినిమాలు చేశాను. చాలా మంది దర్శకులు నాతో రకరకాల కామెడీ చేయించారు. కానీ నాలో ఉన్న భిన్నమైన నటుడిని గుర్తించింది మాత్రం వెట్రిమారన్‌. ఆయన దర్శకత్వం వహించిన ‘విడుదలై’(తెలుగులో ‘విడుదల) చిత్రం నా కెరీర్‌నే మార్చేసింది. ఈ సినిమాలో ఓ క్యారెక్టర్‌ కోసం నేను ఆయన దగ్గరకు వెళ్లాను. కానీ ఆయన నన్నే హీరోగా తీసుకొని సినిమా చేశాడు. హీరోగా మారిన తర్వాత నాపై బాధ్యత మరింత పెరిగింది. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన అభిమానులను నేను ఎంతో గౌరవిస్తాను. వారి అంచనాలకు తగ్గట్లుగా కథలను ఎంచుకోవాలనుకుంటున్నాను. మన గతాన్ని మర్చిపోకుండా, అహంకారానికి పోకుండా ఉంటే.. సినిమా మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది. కొత్త, పాత దర్శకులతో కలిసి పనిచేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను’ అని సూరి అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement