ఏషనాగుల సాంగ్.. పుష్ప, దేవర రికార్డ్స్ బ్రేక్..! | Nani's The Paradise Movie Yeshanagula song creates record in Youtube | Sakshi
Sakshi News home page

Yeshanagula Song: ఏషనాగుల సాంగ్.. పుష్ప, దేవర రికార్డ్స్ బ్రేక్..!

Sep 15 2026 5:13 PM | Updated on Sep 15 2026 5:18 PM

Nani's The Paradise Movie Yeshanagula song creates record in Youtube

నాని హీరోగా వస్తోన్న మాస్ యాక్షన్‌ మూవీ ది ప్యారడైజ్. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రమోషన్లతో దూసుకెళ్తున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ అభిమానులు ఓ ఊపు ఊపేస్తున్నాయి. ఇటీవల రిలీజైన ఫోక్ సాంగ్ ఏషనాగుల ఏకంగా పూనకాలు తెప్పిస్తోంది. ఈ మూవీ యూట్యూబ్‌లో రికార్డులు తిరగరాస్తోంది.

తాజాగా ఈ సాంగ్ మరో రికార్డ్ సొంతం చేసుకుంది. విడుదలైన కేవలం 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్ సాధించిన పాటగా నిలిచింది. సింగిల్ లాంగ్వేజ్‌లో అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న టాలీవుడ్ సాంగ్‌గా రికార్డ్ సృష్టించింది. ఇదే క్రమంలో పుష్ప మూవీలోని ఊ అంటావా మావా, దేవర సినిమాలోని చుట్టమల్లే పేరిట ఉన్న రికార్డులను అధిగమించింది. కాగా.. ఈ మూవీకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement