సుహాస్ మండాడి.. బాక్సాఫీస్ వద్ద ఊహించని వసూళ్లు..! | Tollywood Hero Suhas Mandaadi Movie Collections | Sakshi
Sakshi News home page

Mandaadi Collections: సుహాస్ మండాడి.. ఎన్ని కోట్లు వచ్చాయంటే..!

Sep 15 2026 4:32 PM | Updated on Sep 15 2026 4:54 PM

Tollywood Hero Suhas Mandaadi Movie Collections

టాలీవుడ్ హీరో సుహాస్, కోలీవుడ్ నటుడు సూరి ప్రధాన పాత్రల్లో వచ్చిన మూవీ మండాడి. తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ మూవీకి తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా అదరగొడుతోంది. ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.65 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. కేవలం మౌత్ టాక్‌తో మండాడి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. కాగా.. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సెప్టెంబర్ 10న తెలుగులో రిలీజ్ చేశారు. 

మండాడి కథేంటంటే..

శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం అనే గ్రామం చుట్టూ తిరిగే కథ ఇది. సాట్టా పులి(సుహాస్‌) ఆ ప్రాంతాన్ని శాసిస్తుంటాడు. పడవల తయారీ వ్యాపారం చేస్తూనే.. సునామీ రైడర్స్‌ జట్టుతో ప్రతిసారి పడవ పోటీలకు దిగుతూ విజేతగా నిలుస్తుంటాడు.  ఈ సారి  టీమ్‌లోకి తీసుకోమని మండాడి వర్గానికి చెందిన మల్లేష్‌ అనే కుర్రాడు అడుగుతాడు. అందుకు పులి కొడుకు కిశోర్‌ ఒప్పుకోకపోవడంతో గంగాలమ్మ జాతరలో అతనిపై దాడి చేస్తాడు. దీంతో పులి..తన మనుషులతో మల్లేష్‌ని చంపించేందుకు ప్రయత్నిస్తాడు. ప్రాణాలను దక్కించుకునేందుకు హైదరాబాద్‌లో ఉంటున్న కాళి(సూరి) దగ్గరకు వస్తాడు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement