ఓ అభిమాని రేణుకాస్వామి హత్యకేసులో జైలులో ఉన్న నటి పవిత్రా గౌడకు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఆమె ఇప్పటికే బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. తనకు బెయిల్ ఇవ్వాలంటూ బెంగళూరు కోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసు విచారణలో పవిత్రా గౌడ తన బాధను న్యాయస్థానానికి వివరించింది. కన్నీళ్లు పెట్టుకుంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
జైలులో తనను నైజీరియన్ మహిళ ఖైదీలు వేధిస్తున్నారని మరో పిటిషన్ దాఖలు చేసింది. తనకు బెయిల్ ఇవ్వాలని.. లేనిపక్షంలో చనిపోయేందుకు విషమైన ఇప్పించాలని పిటిషన్‌లో పేర్కొంది. పవిత్రను హత్య చేసేందుకు ప్రయత్నాలు కూడా జరిగాయంటూ ఆమె తరఫున లాయర్లు వాదనలు వినిపించారు. అయితే ఇప్పటికే ఆమె మరో బ్యారక్‌కు తరలించామని సిట్ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి.. తదుపరి విచారణను వాయిదా వేశారు.


