19 ఏళ్ల తర్వాత సీక్వెల్.. ట్రైలర్ రిలీజ్ | Emraan Hashmi Awarapan 2 Trailer out now | Sakshi
Sakshi News home page

Awarapan 2 Trailer: 19 ఏళ్ల తర్వాత సీక్వెల్.. ట్రైలర్ రిలీజ్

Aug 6 2026 9:51 PM | Updated on Aug 6 2026 9:51 PM

Emraan Hashmi Awarapan 2 Trailer out now

ఒక సినిమాకు సీక్వెల్‌ తీయాలంటే రెండు నుంచి మూడేళ్లు టైమ్ పడుతుంది. అలా పుష్ప రిలీజైన మూడేళ్లకు సీక్వెల్‌గా పుష్ప-2 కూడా వచ్చేసింది. కానీ ఓ మూవీ సీక్వెల్‌ దాదాపు రెండు దశాబ్దాల వస్తే ఎలా ఉంటుంది. సరిగ్గా అదే చేశారు మేకర్స్. ఎప్పుడో 2007లో వచ్చిన చిత్రానికి ఇప్పుడు సీక్వెల్‌ తెరకెక్కించారు.

2007లో విడుదలైన క్లాసిక్ యాక్షన్ డ్రామా ఆవారపన్‌. ఇమ్రాన్ హష్మీ, దిశాపటానీ నటించారు. ఈ సినిమాకు దాదాపు 19  ఏళ్ల తర్వాత సీక్వెల్‌గా ఆవారపన్‌ - 2 తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీలో శివమ్ పండిట్ పాత్రలో ఇమ్రాన్‌ తిరిగి వస్తున్నాడంటూ వీడియోను పంచుకున్నారు. ఈ మూవీకి నితిన్‌ కక్కర్‌ దర్శకత్వం వహించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement