ఈ వీకెండ్ థియేటర్లలోకి వచ్చిన సినిమాల్లో 'చెన్నై లవ్ స్టోరీ'కి పాజిటివ్ టాక్ వస్తోంది. సెకండాఫ్ మీద కంప్లైంట్స్ ఉన్నప్పటికీ ఓవరాల్‌గా పర్లేదని అంటున్నారు. మరోవైపు ఇందులో హీరోయిన్‌గా చేసిన తెలుగమ్మాయి శ్రీ గౌరిప్రియకి ప్రశంసలు దక్కుతున్నాయి. అన్ని రకాల ఎమోషన్స్ అద్భుతంగా పండిందని అంతా మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఈమె, సక్సెస్ మీట్‌లో అమ్మని తలుచుకుని ఎమోషనల్ అయింది.
(ఇదీ చదవండి: రిలీజ్ రోజే కలెక్షన్స్ పోస్టర్.. ఇదేం విడ్డూరం?)
'ఇంత మంచి పేరు, విజయం వస్తున్నప్పుడు మా అమ్మ ఉండి ఉంటే చాలా సంతోషించేవారు. నన్ను ఇప్పుడు ఆమె చూసి ఉంటే బాగుండేదని అందరూ అంటున్నారు. కానీ మా అమ్మ ఎప్పుడూ పైనుంచి నన్ను చూస్తూనే ఉంటుంది' అని గౌరిప్రియ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
కిరణ్ అబ్బవరం, గౌరిప్రియ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాతో రవి నంబూరి దర్శకుడిగా పరిచయమయ్యారు. 'బేబి' తీసిన దర్శకుడు సాయి రాజేశ్.. ఈ చిత్రానికి కథ అందించారు. ఎస్కేఎన్ నిర్మించారు. ఇకపోతే ప్రీమియర్లకే రూ.3 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించుకున్నారు. తొలిరోజు మరో రూ.6 కోట్ల వసూళ్లు.. అంటే ఓవరాల్‌గా ఇప్పటివరకు రూ.9 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం.
(ఇదీ చదవండి: చెన్నై లవ్ స్టోరీ.. కిరణ్, శ్రీ గౌరి చేయాల్సింది కాదు..!)
స్టేజ్‌పై హీరోయిన్ గౌరీ ప్రియ ఎమోషనల్
‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్ర విజయోత్సవ సమావేశంలో హీరోయిన్ గౌరీ ప్రియ భావోద్వేగానికి లోనయ్యారు. “ఇంత మంచి పేరు, విజయం వస్తున్నప్పుడు మా అమ్మ ఉండి ఉంటే చాలా సంతోషించేవారు.. నన్ను చూసి ఉంటే బాగుండేదని అందరూ అంటున్నారు. కానీ మా అమ్మ ఎప్పుడూ పైనుంచి… pic.twitter.com/8x0pieJSmx— ChotaNews App (@ChotaNewsApp) July 25, 2026


